Monday, April 29, 2024

బతుకమ్మలకు కానుక

- Advertisement -
- Advertisement -

Distribution of Bathukamma sarees started

రాష్ట్రమంతటా అట్టహాసంగా చీరల పంపిణీ మొదలు

n తొలి సారెను మేడారం వనదేవతలకు
సమర్పించిన ప్రభుత్వం n వరంగల్ భద్రకాళి
ఆలయంలో ప్రత్యేక పూజలు n సిఎం కెసిఆర్
కానుకలను చూసి మురిసిపోయిన మహిళలు
n బంగారు, వెండి జరీ అంచులతో అలరించిన
చీరలు n పలుచోట్ల పంపిణీ కార్యక్రమంలో
పాల్గొన్న మంత్రులు, ఎంపిలు, ప్రజాప్రతినిధులు

మన తెలంగాణ/హైదరాబాద్ : బతుకమ్మ చీరెల పంపిణీ శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అయితే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. మొదటి చీరెను ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క, సారమ్మ వనదేవతలకు మొదటి బతుకమ్మ చీరెలను ప్రభుత్వం అందజేసింది. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఎంతో హుషారుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన కానుకులతో మహిళలు మురిసిపోయారు. ప్రధానంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా బంగారు, వెండి జరీ అంచులతో సుమారు 287 డిజైన్లతో చీరెలను రాష్ట్ర ప్రభుత్వ తయారు చేయించింది. గతంలో కంటే ఈ సారి బతుకమ్మ చీరెల డిజైన్లు మరింత బాగున్నాయని ముందుగానే ప్రచారం జరగింది. దీంతో మొదటి రోజునే చీరెల పంపిణీ కార్యక్రమం అన్ని జిల్లాల్లో అత్యంత అట్టహాసంగా మొదలైంది. మహిళలు వాటిని తీసుకునేందుకు పోటీపడ్డారు. అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో మహిళలు పెద్దఎత్తున గుమిగూడకుండా సంబంధిత అధికారులు ముందస్తూ చర్యలు తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చీరెల పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా, సాఫీగా సాగింది.

కాగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపి కవితతో కలిసి ప్రఖ్యాత గాంచిన మేడారం సమ్మక్క, సారమ్మ దేవతలకు మొదటి బతుకమ్మ చీరెలను సమర్పించారు. అలాగే వరంగల్ అర్భన్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారికి సైతం మంత్రి సత్యవతి రాథోడ్ బతుకమ్మ చీరెను అందజేశారు. అనంతరం జిల్లాలోని ఆడబిడ్డలకు చీరెలను పంపిణీ చేశారు. కాగా మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణఇ చేశారు. అలాగే సూర్యాపేట మున్సిపాలిటీలో 36,981 మందికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చీరెలను అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో రాష్ట్ర విద్యాశాక మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహిళలకు చీరెలను పంపిణి చేశారు. అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలకర్ తదితరులు చీరెలను పంపిమీ చేశారు. కాగా మిగిలిన జిల్లాల్లో కూడా మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలకు బతుకమ్మ కానులను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News