Monday, April 29, 2024

నేడు సద్దుల సంబురం

- Advertisement -
- Advertisement -

Today is Saddula Bathukamma celebrations

 

వాడవాడలా బతుకమ్మ వేడుకలకు
సిద్ధమవుతున్న ఆడపడుచులు
కొవిడ్ నేపథ్యంలో మాస్క్‌లు ధరించి
భౌతికదూరం పాటించాలని సూచనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : నేడు సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవడానికి మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతిసారి జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. ఈసారి జాగృతి సంస్థ నిర్వహించకపోవడంతో మహిళలు వాడవాడలా భక్తి శ్రద్ధలతో గౌరవమ్మకు పూజలు చేయడానికి ముందుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రోజుల క్రితం ఎంగిలిపువ్వు బతుకమ్మ ను మహిళలు నిరాడంబరంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను మహిళలు ధరించి, కోవిడ్ 19 నిబంధనలు పాటి స్తూ ఈ వేడుకలను ప్రతి వాడవాడలా జరుపుకున్నారు. ప్రస్తుతం కోవిడ్19 నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ, మాస్కులను ధరించి, ఒక్కో బతుకమ్మ దగ్గర ముగ్గురు లేదా నలుగురు మహిళలు బతుకమ్మలు ఆడారు.

పువ్వుల రాశినే దేవతామూర్తిగా భావించి…

దసరా అంటేనే గుర్తుకొచ్చే సంబురం బతుకమ్మ పండు గ. శీతాకాలపు తొలి రోజుల ప్రకృతి సౌందర్యంలో పువ్వుల రాశినే దేవతామూర్తిగా భావించి పూజ చేయడం తెలంగాణలో ప్రత్యేక విశేషం. ఇది తెలంగాణ ఆడపడుచుల పూల సంబురం. గునుగు, తంగేడు పూలు బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి రంగు రంగుల పూలను తీర్చి బతుకవమ్మా అంటూ దీవించే అపురూప దృశ్యం ఈ పండుగకు చోటుచేసు కుంటుంది.ప్రస్తుతం ఈసారి అంతటి ఉత్సాహం, కోలాహలం, సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఎవరికి వారే పరిమితంగా బతుకమ్మలాడుతూ మళ్లీ ఏడాదైనా తమ కష్టాలు తీరేలా చూడు తల్లీ అంటూ ఆ గౌరమ్మకు మొక్కుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News