Sunday, April 28, 2024

రాష్ట్రానికి ఆఫ్రికన్ మెడికల్ టూరిస్టులే అధికం..!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్‌లో 25 శాతం తక్కువతో వైద్యం
ప్రతి సంవత్సరం సగటున 24 వేల మందికి హెల్త్ స్టాంపింగ్
నేషనల్ మెడికల్ అండ్ వెల్‌నెస్ రిపోర్టులో వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు వచ్చే మెడికల్ టూరిస్టులలో ఆఫ్రికన్లే అత్యధికంగా ఉన్నట్లు నేషనల్ మెడికల్ అండ్ వెల్‌నెస్ రిపోర్టులో(ఎన్‌ఎండబ్లూ) పేర్కొన్నారు. ప్రతి ఏడాది మన రాష్ట్రంలో వైద్యం పొందేందుకు సుమారు 24వేల మంది విదేశీయులు హెల్త్ స్టాంప్ చేయిం చుకుంటుండగా, ఇరాక్, కెన్యా, సోమాలియా, ఎమెన్, సూడాన్, నైజీరియా దేశాల నుంచే ఏకంగా 90 శాతం మంది వస్తున్నారని ఆ నివేదికలో పొందుపరిచారు. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ లో 25 శాతం తక్కువతో వైద్యం అందడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు.

వాస్తవంగా పదేళ్ల క్రిందట వివి ధ ఆపరేషన్లు, ఇతర ట్రీట్మెంట్ కొరకు విదేశీయులు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేవా రు. కానీ హైదరాబాద్‌లో రోజురోజుకి బలోపేతమవుతు న్న వైద్యసేవలతో విదేశీయులు ఇక్కడికి క్యూ కడుతున్న ట్లు నిపుణులు అంటున్నారు. వస్తున్న వారిలో సుమారు 50శాతం మంది క్యాన్సర్ రోగులే కావడం గమనార్హం. దీంతో పాటు 10 శాతం అవయవ మార్పిడి, 20 శాతం మంది కంటికి సంబంధించిన సమస్యలతో వస్తున్నట్లు వెల్ల డించారు. అంతేగాక ఆర్థోపెడిక్స్, ఇఎన్‌టి సమస్యలతో వచ్చేవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారని ఎన్‌ఎండబ్లూ రిపోర్టులో తెలిపారు. అయితే కరోనాతో కాస్త కుదేలైన మెడి కల్ టూరిజం ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుందని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. హైదరాబాద్ సిటీలో సుమారు 10 కార్పొరేట్ ఆసుపత్రులు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందిస్తున్నట్లు ప్రము ఖ డాక్టర్ ఒకరు అన్నారు. దీంతోనే సిటీ మెడికల్ హబ్‌గా మారిందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అక్కడి ఖర్చులో ఇక్కడ కేవలం 10 శాతమే…

విదేశాల్లో అయ్యే మెడికల్ ఖర్చులో కేవలం పది శాతం వెచ్చిస్తే మన రాష్ట్రంలో ఆ ఆపరేషన్లు జరిగిపోతాయని మెడికల్ ఎక్స్‌పర్ట్ అంటున్నారు. దీంతోనే మన రాష్ట్రం మెడికల్ టూరిజం స్పాట్(విదేశాలకు చెందిన వ్యాధిగ్రస్తు లు మన దేశం, రాష్ట్రానికి వైద్యం కోసం రావడం) అయిందని ఆయన అన్నారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై ప్రాంతాల కు హాలిడీ ప్యాకేజీ కింద వైద్య సేవల అందుతున్నప్పటికీ, మౌళికవసతులు, ప్రమాణికమైన డాక్టర్లు హైదరాబాద్‌లో నే ఎక్కువశాతం ఉండటంతో విదేశీయులు ఇక్కడ ట్రీట్మెం ట్ పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు నిపుణులు పేర్కొం టున్నారు. మరోవైపు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల తో పోలిస్తే కూడా హైదరాబాద్‌లోని మల్టీ సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో కేవలం10 శాతం ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందుతుందని ఎన్‌ఎండబ్లూ స్పష్టం చేసింది.

పదేళ్లల్లో ఆరురెట్లు పెరిగింది

దేశ వ్యాప్తంగా గడిచిన పదేళ్లల్లో మెడికల్ టూరిజం ఆరురెట్లు పెరిగింది. 2009లో మన దేశంలోకి మెడికల్ వీసాలతో 1.12 లక్షల మంది రాగా, 2019 నాటికి ఆ సంఖ్య 6.97 లక్షలకు చేరుకుంది. వీరిలో బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా 57.53 శాతం మంది ఉండగా, ఆ తర్వాత ఇరాక్ నుంచి 8.07 శాతం, మాల్దీవుల నుంచి 7.31 శాతం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 4.73 శాతం, ఒమన్ నుంచి 3.21 శాతం, ఎమెన్ నుంచి 2.39 శాతం మంది వచ్చినట్లు ఎన్‌ఎండబ్యూ ప్రతినిధులు వెల్లడించారు. అలాగే శ్రీలంక, మయన్మార్, మారిషస్, పాకిస్తాన్, అమెరికా, సూడాన్, కెన్యా, నైజీరియా, టాంజానియా, సౌదీ అరేబియా, యూకే, నేపాల్, టర్కీ, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా, దక్షిణాఫ్రికా, రష్యా, ఫ్రాన్స్, ఈజిఫ్ట్, ఇండోనేషియా, జర్మనీ, న్యూజీలాండ్, చైనా, ఇటలీ, సింగపూర్, బెల్జియం తదితర దేశాల నుంచి కూడా కొద్ది శాతం మంది వచ్చినట్లు పేర్కొన్నారు.

అన్ని రకాల్లో ట్రీట్మెంట్….

అన్ని రకాల వైద్యం అందించడంలో భారతదేశం ముందువరుసలో ఉంది. అల్లోపతితో పాటు ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమితోపతి విధానంతో కూడా రోగులను నయం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలపై విదేశీయులకూ అవగాహన కల్పిస్తుంది.

మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ట్రేడ్ ఫెయిర్స్, ప్రొమోషనల్ ఈవెంట్లు, రోడ్‌షోలు, సెమినార్లు, బిబిసి సహకారంతో మెడికల్ టూరిజంపై ఫిల్మ్ నిర్మాణాన్ని కూడా చేపట్టింది. అంతేగాక విదేశాల్లో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు వర్క్‌షాప్‌లు, ఈవెంట్లు, సెమినార్లు నిర్వహించేందుకు అవసరమయ్యే ఖర్చులో 50 శాతం కేంద్రం వెచ్చిస్తుంది. అంతేగాక రోగి ఎలాంటి ఇబ్బందులు పడకుండగా రెండు మెడికల్ అటెండెంట్ వీసాలకు కూడా అనుమతి ఇస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News