Monday, April 29, 2024

పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎంఐఎం పోటీ..

- Advertisement -
- Advertisement -

పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎంఐఎం పోటీ
చర్చలు జరుపుతున్న పార్టీ అధినేత అసదుద్దీన్
ఇప్పటికే బెంగాల్ నేతలతో చర్చలు ఫలప్రదమని అసద్ ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమన్(ఏఐఎంఐఎం) మెల్లగా ఒక్కో రాష్ట్రంపై కన్నేస్తోంది. ఈ మధ్య జరిగిన బీహార్ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచి ఊపు మీదున్న ఆ పార్టీ ఇప్పుడు తమిళనాడు వైపు చూస్తోంది. దీనికోసం కమల్‌హాసన్‌తో చేతులు కలపడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. అయితే కమల్‌హాసన్‌తో అసద్ పొత్తు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బిజెపిని వ్యతిరేకించే విషయంలో ఈ ఇద్దరూ ఒకేలా స్పందిస్తారు. గతంలో గాంధీని చంపిన గాడ్సే ఓ ఉగ్రవాది అన్న కమల్‌హాసన్ వ్యాఖ్యలతో అసదుద్దీన్ ఓవైసీ ఏకభవించారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. అది కూడా హీరో కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో చేతులు కలిపి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికలకు సంబంధించి తమిళనాడు పార్టీ ఆఫీస్ బేరర్లతో హైదరాబాద్‌లో అసద్ సమావేశమై చర్చించినట్టుగా తెలుస్తోంది.
తమిళనాడులో 5.86 శాతం ముస్లింలు
వచ్చే జనవరిలో తిరుచ్చి, చైన్నైలలో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడులో జనాభాలో ముస్లింలు 5.86 శాతంగా ఉన్నారు. వెల్లూర్, తిరుపత్తూర్, క్రిష్ణగిరి, రామనాథపురం పుడుకొట్టాయ్, తిరుచ్చి, మధురై, తిరునల్వేలి జిల్లాలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఈ జిల్లాలోని నియోజకవర్గాలపై ఎంఐఎం కన్నేసింది. దీనికోసం కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో పాటు నామ్ తమిళర్‌లాంటి ఇతర చిన్న పార్టీలతో చేతులు కలపనున్నట్టు ఎంఐఎం వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఇప్పటికే ఇండియన్ ముస్లిం లీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మనితనేయ మక్కల్ కచ్చి, ఆలిండియా ముస్లిం లీగ్‌లాంటి పార్టీలు ఉన్నా ఇవన్నీ డిఎంకె, ఏఐఏడిఎంకెలలో ఏదో ఒక పార్టీకి తోక పార్టీలుగా ఉన్నాయి.
బెంగాల్ నేతలతో చర్చలు ఫలప్రదం
ఈ మధ్య బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఐదు స్థానాల్లో గెలిచి ఎంఐఎం ఆశ్చర్యపరిచింది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న బైసీ, అమౌర్, కొచ్చాదామన్, బహదూర్‌గంజ్, జోకీహట్‌లో ఎంఐఎం అభ్యర్థులు గెలిచారు. ఇప్పటికే బెంగాల్ నేతలతో అసద్ శనివారం భేటీ కాగా చర్చలు ఫలప్రదం అయినట్టుగా ట్విట్టర్ వేదికగా అసద్ పేర్కొన్నారు.

AIMIM to Contest in TN and Bengal Polls 2021: Owaisi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News