Monday, April 29, 2024

ఇండియాకు 200 వెంటిలేటర్లు: అమెరికా

- Advertisement -
- Advertisement -

America give 200 ventilators to India

 

ఢిల్లీ: ఇండియాకు 200 వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాకు చెందిన ఇంటర్ నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇండియాకు రెండు వందల వెంటిలేటర్లు ఇస్తామని పేర్కొంది. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు భాగంగా వెంటిలేటర్లు ఇస్తున్నామని వెల్లడించింది. మే, జూన్ నెలల్లో వెంటిలేటర్లు భారత్‌కు రానున్నాయి. ఇంత కష్ట కాలంలో పలు దేశాలకు అమెరికా సాయం చేస్తోంది. యుఎస్‌పెయిడ్ ఫండ్స్ కింద వెంటిలేటర్లు పలు దేశాలకు ఇస్తున్నామని చెప్పింది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువుగా ఉండడంతో వారి కోసం వెంటిలేటర్లు తయారు చేశామని, ఇతర దేశాలు కూడా వాడుకునే విధంగా వాటిని మారుస్తున్నారు. ప్రపంచంలో కరోనా వైరస్ 48 లక్షల మందికి వ్యాపించగా 3.16 లక్షల మంది మరణించారు. అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 15.27 లక్షలకు చేరుకోగా 91 వేల మంది చనిపోయారు. న్యూయార్క్‌లో కరోనా వైరస్ 3.60 లక్షల మంది సోకగా 28 వేల మంది మృత్యువాతపడ్డారు. భారత్‌లో కరోనా వైరస్ 96 వేల మందికి వ్యాపించగా 3 వేలకు పైగా మరణించారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు భారత్ నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను భారత్ అందించిన విషయం తెలిసిందే.

దేశాల వారిగా వివరాలు….

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News