Home Default జమ్ముకశ్మీర్‌లో భూకంపం..

జమ్ముకశ్మీర్‌లో భూకంపం..

An Earthquake of Magnitude 4.3 hits Rajouri district

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. రాజౌరీకి దక్షిణ నైరుతి దిశలో 84 కి.మీ దూరంలో 10 కిమీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. భూ కంపంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. కాగా, మంగళవారం కూడా ఇండోనేషన్, మలేషియాతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ భూకంపం సంభవించింది.

An Earthquake of Magnitude 4.3 hits Rajouri district