Monday, April 29, 2024

దాక్షాయ‌ణి లుక్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా అలరించిన హాట్ యాంకర్ అనసూయ మరోసారి కీలక పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో అనసూయ దాక్షాయ‌ణి అనే పవర్ పుల్ పాత్రలో నటిస్తుంది. తాజాగా అనసూయ దాక్షాయ‌ణి లుక్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అసలు అనసూయను గుర్తు పట్టలేనంతగా మార్చేశాడు సుకుమార్. దీంతో ప్రేక్షకులు దాక్షాయణికి లుక్ కు ఫిదా అయిపోతున్నారు. రంగమ్మత్తగా అనసూయ నటనను చూసిన దర్శకులు ఆమె కోసం ప్రత్యేక పాత్రలను రాస్తుండడంతో.. వరుస ఆఫర్లతో అనసూయ బిజీ అయిపోయింది. ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. కాగా, ‘పుష్ప’లో అనసూయ చేస్తున్న దాక్షాయణి పాత్ర నెగెటివ్ గా ఉంటుందని, ఈ పాత్ర ఆమె కెరీర్ లోనే గుర్తుండిపోయేట్లుగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

Anasuya’s Dakshayani look released from Pushpa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News