Saturday, May 11, 2024

అంక్లేశ్వర్ కొవాగ్జిన్ టీకా విడుదల

- Advertisement -
- Advertisement -

Ankleshwar Covaxin Vaccine Release

అంక్లేశ్వర్ : భారత్ బయోటెకు చెందినకొత్త ఫ్యాక్టరీ నుంచి ఆదివారం తొలి వాణిజ్యస్థాయి కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తి ఆరంభం అయింది. గుజరాత్‌లోని బరూచ్ జిల్లాలోని అంకేశ్వర్‌లోని ఈ ఫ్యాక్టరీ నుంచి తొలి టీకాల బ్యాచ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ విడుదల చేస్తూ కోవిడ్ 19 వ్యతిరేకంగా దేశం సాగిస్తున్న పోరులో ఇది చారిత్రక పరిణామం అన్నారు. ఇక్కడి భారత్ బయోటెక్ చిరాన్ బెహ్రింగ్ వ్యాక్సిన్స్ కేంద్రం నుంచి తొలి బ్యాచ్ డోసులను జాతికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం నుంచి ఇక్కడ టీకాల ఉత్పత్తి ఆరంభం అయింది. నెలకు కోటికి పైగా డోసుల ఉత్పత్తి సామర్థంతో ఇది నిలుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ కేంద్రం ద్వారా తయారు అయ్యే డోసులు సరఫరాకు అందుబాటులోకి వస్తాయని అధికార ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News