Monday, April 29, 2024

ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు!

- Advertisement -
- Advertisement -

Aryan Khan gets bail

ముంబయి: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే బాంబే హైకోర్టు డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్, మూన్‌మూన్ ధమేచ, అర్బాజ్ సేథ్ మర్చంట్‌లకు గురువారం బెయిల్ మంజూరుచేసింది. ఆర్యన్‌ఖాన్‌ను అక్టోబర్ 3న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) అరెస్టు చేసింది. నాటి నుంచి అతడు కటకటాల వెనుకే ఇన్నాళ్లు ఉన్నాడు. బార్ అండ్ బెంచ్ కథనం ప్రకారం కోర్టు ఉత్తర్వు వివరాలు, ఆపరేటివ్ పార్ట్‌తో సహా రేపు అందనుంది. విచారణ సందర్భంలో ఎన్‌సిబి తరఫు ప్రతినిధి అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(ఎఎస్‌జి) అనిల్ సింగ్ ఆర్యన్ వద్ద నిషేధిత మాదకద్రవ్యాన్ని కనుగొన్నామని అన్నారు.
.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News