Monday, April 29, 2024

అటల్ టెన్నెల్‌ సైనికుల‌కే అంకితం: రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

atal tunnel is dedicated to soldiers Says Rajnath

న్యూఢిల్లీ‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో నిర్మించిన అటల్ సొరంగమార్గం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని కేంద్ర‌ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పిర్ పంజల్ పర్వత శ్రేణుల్లో మనాలి నుంచి లేహ్ వరకు నిర్మించిన అటల్ టెన్నెల్ ను  రాజ్‌నాథ్ సింగ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్  మాట్లాడుతూ… అట‌ల్ సొరంగమార్గాన్ని స‌రిహ‌ద్దుల్లో కాప‌లాకాసే‌ సైనికుల‌కు అంకితం ఇస్తున్నామన్నారు. ఈ అటల్ టన్నెల్ దేశ ఆహార పదార్థాలు, వాణిజ్య సరకులు, ఆర్థిక, వాణిజ్య అవసరాలను తీరుస్తుంద‌ని రాజ్‌నాథ్ చెప్పారు. రూ.3500 కోట్ల అంచనా వ్య‌యం పరిధిలోనే అటల్ సొరంగమార్గం నిర్మించామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Atal tunnel is dedicated to soldiers Says Rajnath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News