Monday, April 29, 2024

పశ్చిమ్ బెంగాల్ లో ఆంక్షలు.. రేపటి నుంచి విద్యాసంస్థలు బంద్

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: పశ్చిమ్ బెంగాల్ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ తరహా ఆంక్షలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, జూ పార్కులు, సెలూన్లు, స్పాలు, బ్యూటీపార్లర్లను కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతోనే కార్యకలాపాలు కొనసాగించాలని తెలిపింది. పాలనా పరమైన సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించుకోవాలని సూచించింది. ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలను విధిస్తున్నాయి.

Bengal Govt impose Restrictions due to Omicron

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News