Sunday, April 28, 2024

ప్రముఖ సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Bhajan singer Narendra Chanchal passed away

ముంబై: ప్రముఖ భజన గాయకుడు, సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూశారు. గత కొన్ని నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు  80 సంవత్సరాలు. పంజాబ్ లో జన్మించిన నరేంద్ర చంచల్ ను ‘భజన్ కింగ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. భజన పాటలతో పాటు హిందీ సినిమాల్లో ఎన్నో పాటలను పాడారు. బాబి సిన్మాలోని ‘బేషక్‌ మందిర్‌ మసీద్‌’ పాటకు గానూ ఆయన ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. చంచల్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తన మధురమైన గానంతో చంచ‌ల్‌ ఆధ్యాత్మిక ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని ప్ర‌ధాని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. సంగీత తారలు, కేంద్ర సాంస్కృతిక శాఖ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో చంచల్ కు నివాళులు అర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News