Monday, April 29, 2024

బంద్‌కు ఆర్టీసి మద్దతు.. కదలని బస్సులు

- Advertisement -
- Advertisement -

Bharat Bandh Today Live Updates

హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలకు సంఘీభావంగా హైదరాబాద్‌లో భారత్ బంద్ కొనసాగింది. బంద్‌కు అధికార పార్టీ టిఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు రహదారుల దిగ్బంధంలో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆర్టీసి కార్మికులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌లో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. హకీంపేట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆర్టీసి కార్మికులు నినాదాలు చేశారు. కూకట్‌పల్లి, కాచిగూడ, బర్కత్‌పురా, హయత్‌నగర్, రామచంద్రాపురం, బిహెచ్‌ఈఎల్, మేడ్చల్, కుషాయిగూడ, గచ్చిబౌలి, జీడిమెట్ల, ఉప్పల్, మియాపూర్, హయత్‌నగర్ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు కదలకపోవడంతో బస్టాండ్లు బోసిపోయాయి.

Bharat Bandh Today Live Update

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News