Thursday, May 9, 2024

రాజ్యాంగాన్ని బిజెపి బలహీనపరుస్తోంది: మాయవతి

- Advertisement -
- Advertisement -

Mayawati

 

న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ మతత్వానికి అడుగులు వేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే నిరసనలు హింసాత్మకం కావద్దని బిఎస్‌పి అధినేత్రి మాయవతి అన్నారు. ఈ ఏడాది గతేడాది మాదిరిగా బాధాతప్తమైన సంవత్సరంగా ఉండకూడదని ఆమె ఆకాంక్షించారు. 2019లో బిజెపి ప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వం మతత్వ, అనాలోచిత విధానాలు అవలంబిస్తూ రాజ్యాంగాన్ని బలహీపరిచాయన్నారు.

దీంతో ఆందోళనలు, నిరసనలు జరగడం బాధాకరమని, దురదృష్టకరమని మాయావతి పేర్కొన్నారు. దేశంలో చోటుచేసుకునే నిరసనలతో ప్రజలకు, ఏ మతానికి సైతం ఇబ్బందులు కలగకూడదన్నారు. వివిధ వర్గాలు, మాతాలు ఉన్న భారతదేశం లౌకిక దేశమని ప్రజలు మరిచిపోకూడదని, వారి సంస్కృతి సంప్రదాయాలను, జీవన విధానాలను తప్పక గౌరవించాలని మాయవతి చెప్పారు.

BJP is Weakening the Constitution Says Mayawati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News