Monday, April 29, 2024

నా ట్విటర్ అకౌంట్ హ్యాక్ చేశారు

- Advertisement -
- Advertisement -
BJP leader Khushbu Sundar Twitter account hacked
పోలీసులకు ఖుష్బు సుందర్ ఫిర్యాదు

చెన్నై: తన ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బు సుందర్ మంగళవారం వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తాను ఎటువంటి ట్వీట్‌లు కాని పోస్టింగ్‌లు కాని పెట్టలేదని ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. మూడు రోజుల క్రితం తన ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్లు ఆమె తెలిపారు. ఈ విషయం గురించి ట్విటర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంతో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు.

గత కొద్ది రోజులుగా తన ట్విటర్ ఖాతాలో ఏవైనా ట్వీట్లు వచ్చి ఉంటే అవి తన ప్రమేయంతో జరిగినవి కావని ఆమె వివరించారు. కాగా, తన ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌పై ఖుష్బు రాష్ట్ర పోలీసు డిజిపి సి శైలేంద్ర బాబుకు ఫిర్యాదు చేశారు. తన ట్విటర్ ఖాతా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆమె తన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. తన ట్విటర్ హ్యాండిల్ పేరును మార్చివేశారని, తన ట్విటర్ ఖాతా తన అందుబాటులోకి రావడం లేదని డిజిపి కార్యాలయం వద్ద విలేకరులకు ఆమె తెలిపారు.

BJP leader Khushbu Sundar Twitter account hacked

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News