Sunday, April 28, 2024

బ్లాక్‌మెయిల్ రాజస్థాన్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Blackmail Rajasthan gang arrested in Hyderabad

ఓఎల్‌ఎక్స్, న్యూడ్ వీడియోలు పంపిస్తున్న ముఠా
10 మందిని పిటి వారెంట్‌పై తీసుకువచ్చిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్: వివిధ రకాల పేర్లు చెప్పి పలువురిని సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ముఠాను నగర పోలీసులు పిటి వారెంట్‌పై సోమవారం తీసుకుని వచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం, అవెర్ జిల్లాకు చెందిన సాహుస్, నిస్సార్ అహ్మద్, ఆరిఫ, అజర్, మహ్మద్ షాహిద్, షాహిద్‌ఖాన్, సాహిల్, వారిస్, రాహుల్, బర్కత్‌ను గతంలో రాజస్థాన్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పది మంది ముఠా సభ్యులు ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ డబ్బులకు మొబైల్స్, కార్లు విక్రయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌లో పలువురు బాధితులను పరిచయం చేసుకుని వలపు వల విసురుతున్నారు. బాధితులతో కొద్ది రోజులు ఛాటింగ్ చేసిన తర్వాత వారితో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడుతున్నారు.

వీడియో కాల్‌ను వారికి తెలియకుండా రికార్డు చేస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత వీడియోను బాధితులకు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. వెంటనే తమ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపాలని లేకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చాలామంది బాధితులు పరువుపోతుందని వీరి చెప్పిన డబ్బులు పంపిస్తున్నారు. అయినా కూడా నిందితులు పదే పదే డబ్బులు అడుగుతుండడంతో భరించలేక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ ముఠాపై మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. గతకొంత కాలం నుంచి ఈ ముఠా కోసం సైబర్ క్రైం పోలీసులు వెతుకుతున్నారు. రాజస్థాన్ రాష్ట్ర పోలీసులు వీరిని అరెస్టు చేయడంతో పిటి వారెంట్‌పై నగరానికి తీసుకుని వచ్చారు.

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముఠా పలువురు అమాయకులకు ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. దానిని యాక్సెప్ట్ చేసిన వారితో కొద్ది కాలం ఛాటింగ్ చేసిన తర్వాత చనువుగా మాట్లాడి న్యూడ్ వీడియో కాల్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. వీరి మాటలు నమ్మి వీడియో కాల్ మాట్లాడిన వారిని వీడియోలు రికార్డు చేసి వాటిని బాధితులకే పంపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. వీరి బారిన పలువురు బాధితులు పడి లక్షలాది రూపాయలు కోల్పోతున్నారు. సమాజంలో పరువు పోతుందని భావించి వారి అడిగిన డబ్బులు ఇస్తున్నారు. దీనిని మరింత అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోతున్నారు. రాజస్థాన్ పోలీసుల అరెస్టుతో వీరి ఆటకు అడ్డు కట్టపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News