Monday, April 29, 2024

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ కు పుత్రోత్సాహం.. 55ఏళ్ల వయసులో ఐదో బిడ్డ..

- Advertisement -
- Advertisement -

 

ఇటీవల కరోనాతో పోరాడి పూర్తిగా కోలుకున్న బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్(55)‌కు కొడుకు పుట్టాడు. బోరిస్ గ‌ర్ల్‌ఫ్రెండ్ క్యారీ సైమండ్స్(32) బుధవారం లండన్‌లోని హాస్పిట‌ల్‌లో పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు ప్ర‌ధానమంద్రి కార్యాలయం వెల్లడించింది. త‌ల్లీ, బిడ్డ ఇద్ద‌రూ ఆరోగ్యంగా ఉన్న‌ట్లు తెలిపింది. గ‌త ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న బోరీస్, సైమండ్స్ లకు ఇంకా పెళ్లికాలేదు. ప్రస్తుతం వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కాగా, బోరిస్ కు ఇదివరకే రెండు పెళ్లళ్లయ్యాయి. ఇప్పుడు పుట్టిన బిడ్డతోపాటు ఆయనకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు.

Boris Johnson and Carrie Symonds announce birth of baby

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News