Monday, April 29, 2024

సుడిగుండంలో చిక్కుకున్న వ్యక్తి…. కాపాడిన పోలీస్… (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

whirlpool

కాలిఫోర్నియా: సుడిగుండంలో చిక్కుకున్న టూరిస్ట్‌ను ఓ పోలీస్ ఆఫీసర్ కాపాడిన సంఘటన అమెరికా దేశం కాలిఫోర్నియాలోని ఎంజెల్ జలపాతంలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రమాదవశాత్తు యాత్రికుడు ఎంజెల్ జలపాతంలోని సుడిగుండంలో చిక్కుకున్నాడు. జలపాతంలో నీళ్లు చల్లగా ఉండడంతో కదల్లేక పోతున్నాడు. పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీస్ ఆఫీసర్ డోన్లీ అక్కడికి చేరుకున్నాడు. ఒక వైపు తాడును పట్టుకుని… మరోవైపు కర్రకు తాడు కట్టి.. కర్రను నీళ్లలోకి వదిలాడు. సుడిగుండంలో ఉన్న వ్యక్తి కర్రను పట్టుకున్నాడు. బయట ఉన్న ముగ్గురు తాడును లాగడంతో అందులో నుంచి వ్యక్తి బయటపడ్డాడు. పోలీస్ అధికారి రాకపోతే సుడిగండానికి బలయ్యేవాడినని బాధితుడు తెలిపాడు. పోలీస్ అధికారి డోన్లీ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ సమయంలో అలాంటి ఆలోచన రావడం గొప్ప విషయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  48 గంటల్లో ఈ వీడియో 1.5 లక్షల మంది వీక్షించగా రెండు వేల మంది లైక్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News