Sunday, April 28, 2024

10, 12 పరీక్షలు రద్దు చేయాలి.. విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్

- Advertisement -
- Advertisement -

Cancel CBSE and ICSE Board Examinations

 

విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ : సుప్రీం కోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : కరోనా కారణంగా వాయిదా పడిన సిబిఎస్‌ఇ, సిఐఎస్‌ఇ బోర్డు 10, 12 తరగతుల పరీక్షలు జులై 1 నుంచి నిర్వహించడానికి షెడ్యూలు ఖరారైనా వాటిని రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకు నిర్వహించిన పరీక్షల సరాసరి ఫలితాల బట్టి కానీ లేదా అంతర్గత మదింపు ప్రకారం కానీ ఫలితాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఆన్‌లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. వీరిలో నలుగురు కరోనా విజృంభిస్తున్నందున పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా లక్షణాలు పైకి కనిపించని విద్యార్థి కానీ, లేదా ఇన్విజిలేటర్ కానీ తరగతి గదిలో పిల్లలందరికీ వైరస్‌ను సంక్రమింప చేయగలరని, ఈ పరిస్థితుల్లో తమ పిల్లలను ఎవరు రక్షిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకే గదిలో నాలుగు గంటల పాటు వైరస్ భారంతో ఉండడం చాలా ప్రమాదమని ఒక విద్యార్థి తండ్రి నిషాంత్ అక్షర్ ఆందోళన వెలిబుచ్చారు.

ఇతర ప్రమాదాల మాదిరిగా రాత్రికి రాత్రే పరిస్థితి అధ్వాన్నం అయితే ఎలా? ఆఖరి నిమిషంలో పరీక్షలు రద్దయితే విద్యార్థులు మళ్లీమళ్లీ తయారవ్వాల్సి వస్తే విద్యార్థుల మానసిక పరిస్థితి ఏవిధంగా ఉంటుంది ? పదో తరగతి విద్యార్థి తల్లి రోహిణీ భూమిహార్ ప్రశ్నించారు. పరిస్థితి మెరుగుపడుతుందన్నది చెప్పలేం. పంజాబ్, తెలంగాణ, తమిళనాడు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 12 వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఇదివరకటి పరీక్షల ఫలితాల సరాసరిని లెక్కకట్టి ఫలితాలు ప్రకటించేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. సిబిఎస్‌ఇ తన పరిధిలో విదేశాల్లో ఉన్న 250 పాఠశాలల్లో 10,12 తరగతుల పరీక్షలను రద్దు చేసి ప్రాక్టికల్ పరీక్షలు లేదా అంతర్గత అంచనా ప్రకారం ఫలితాలు నిర్ణయించాని నిర్ణయించగా, అలాంటి విధానం మన దేశంలో ఎందుకు అమలు చేయరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News