Monday, April 29, 2024

దుబ్బాకలో టిఆర్‌ఎస్ విజయానికి గండికొట్టిన స్వతంత్య్ర అభ్యర్ధి

- Advertisement -
- Advertisement -

Car-like mark caused the TRS candidate to lose

 

కారును పోలిన గుర్తును కేటాయించిన అధికారులు
ఆ గుర్తుకు పడిన ఓట్ల సంఖ 3,489 ఓట్లు
కాంగ్రెస్ తరువాతి స్థానంలో నిలిచిన సదరు అభ్యర్ధి

మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉపఎన్నికలో ఒక స్వతంత్ర అభ్యర్ధికి కేటాయించిన గుర్తు టిఆర్‌ఎస్ అభ్యర్ధి పరాజయానికి కారణమైంది. సదరు అభ్యర్ధికి కారు పోలిన గుర్తును కేటాయించడం వల్ల ఓటర్లు కొంతమేర కన్ఫూజ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో కారు గుర్తుపై పడాల్సిన ఓట్లు కాస్త స్వతంత్ర అభ్యర్ధి ఖాతాలో పడ్డాయి. ఫలితంగా గెలువాల్సిన టిఆర్‌ఎస్ అభ్యర్ధి చివరలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పైగా సదరు అభ్యర్ధి మొత్తం 3,489 ఓట్లు దక్కించుకుని ప్రధాన అభ్యర్ధుల తరువాత నాలుగవ స్థానంలో నిలిచారు. గెలుపుపై ఎలాంటి అంచనాలు లేని ఒక స్వతంత్ర అభ్యర్ధికి ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు రావడం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదు. పైగా రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల సంగ్రామంలో సదరు వ్యక్తికి ఆ స్థాయిలో ఓట్లు రావడం అంత సులువు కాదన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నది. అవి ఖచ్చితంగా కారు గుర్తుకు పడాల్సిన ఓట్లేనని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

దుబ్బాక ఉపఎన్నికల్లో మొత్తం 1,64,186 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బిజెపి అభ్యర్ధి రఘునందన్‌రావుకు 62,772, టిఆర్‌ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతకు 61,302, కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి. కాగా స్వతంత్ర అభ్యర్ధి (బండారు నాగరాజు)కి ఏకంగా 3,489 ఓట్లు పడ్డాయి. ప్రధానమైన ఈ మూడు పార్టీల తరువాత నాలుగవ స్థానంలో ఆయనే నిలిచారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా ఆయనది నాలుగవ స్థానమే. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,453 ఓట్లు రాగా అందుబాలో చెల్లిన ఓట్లు 1,381. ఇందులో టిఆర్‌ఎస్‌కు 720, బిజెపికి 368, కాంగ్రెస్‌కు 142 ఓట్లు రాగా, సదరు స్వతంత్ర అభ్యర్ధికి 60 ఓట్లు వచ్చాయి. కారు గుర్తు పోలిన గుర్తుకు పడిన ఓట్లలో కనీసం సగం ఓట్లు టిఆర్‌ఎస్‌కు పడినా ఆ పార్టీ అభ్యర్ధి ఘన విజయం సాధించే వారు. కానీ సంబంధిత ఎన్నికల అధికారులు స్వంతంత్ర అభ్యర్ధికి కేటాయించిన గుర్తు కారణంగా విజయం సాధించాల్సిన టిఆర్‌ఎస్ ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News