Monday, April 29, 2024

కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం మార్గదర్శకాలు జారీ

- Advertisement -
- Advertisement -

Center has issued guidelines for distribution of Covid vaccine

 

టీకా నిల్వకు
రాష్ట్రానికి భారీ రిఫ్రిజిరేటర్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. టీకాను ఎవరికి వేయాలి? దానిని ఎలా నిల్వ చేయాలి? వేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? టీకా తీసుకున్న తర్వాత పాటించాల్సిన నియమాలు ఏంటి? అనే అంశాలను 110 పేజీల బుక్ లెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆన్ని రాష్ట్రాలకు వివరించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలీవిధంగా ఉన్నాయి. కోవిన్ సాఫ్ట్‌వేర్ యాప్‌లో నమోదైన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మాత్రమే టీకా ఇవ్వాలి. టీకా పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించాలి. సాధారణ పౌరులకు టీకా ఇవ్వాల్సి వస్తే వారి నమోదు కొరకు ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ లేదా డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి.

గ్రామస్థాయిలో టీకాలు అందించేందుకు పిహెచ్‌సి, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, గ్రామపంచాయతీలు, మున్సిపల్, ప్రభుత్వ సంబంధిత బిల్డింగ్‌లను టీకా కేంద్రాలుగా వినియోగించుకోవాలి. ఒక్కో కేంద్రంలో 200 మందికి మించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఒక ఎంబిబిఎస్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక సహాయకుడు, ఒక టెక్నిషియన్ టీకా వేసే సమయంలో తప్పనిసరిగా ఉండాలి. టీకా ఎవరికి వేశారు? అనే వివరాలు కచ్చితంగా కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలి. టీకా పంపిణీ కేంద్రాల్లో వికలాంగులు, గర్భిణీలకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలి. హైరిస్క్ గ్రూప్‌కు చెందిన వారిని కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక వాహనాలు సమకూర్చాలి. టీకా పంపిణీ కేంద్రాల్లో పొగతాడం నిషేధం, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ. టీకా ఉదయం నుంచి సాయంత్రం వేళల్లో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

టీకా పంపిణీకి వడిగా అడుగులు

రాష్ట్రంలో కోవిడ్19 వ్యాధి నిరోధక టీకా పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వ కేంద్రాల (స్టోరేజ్ పాయింట్లు) అవసరాలకు తగ్గట్లు ఆరు అడుగుల ఎత్తులో ఉండే 40 భారీ రిఫ్రిజరేటర్లు రాష్ట్రానికి చేరుకుంటున్నాయి. వీటిని వెంటనే జిల్లా కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న వాటి కంటే అదనంగా ఆరు వాకింగ్ కూలర్లు పంపుతారు. చెన్నై నుంచి కోవిడ్ టీకా రాష్ట్రానికి రానుంది. పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేసే విధానాన్ని టీకా పంపిణీకి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. చేతికి చర్మం కింద లేదా కండరాలకు సూది ద్వారా టీకా వేసేందుకు వీలుగా సిరంజిలను సిద్ధః చేసేలా చర్చలు సాగాయి. రాష్ట్రంలో అవి లేకపోతే, కేంద్రం పంపనుంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి (డిసెంబర్ 25) సందర్భంగా టీకా పంపిణీలో కీలక ఘట్ఠం చోటు చేసుకునే అవకాశం ఉందనిప భావిస్తున్నారు.

టీకా పంపిణీ ఇలా…!

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు కలిసి సుమారు 3 లక్షల మంది ఉన్నారు. 5060 ఏళ్లు దాటినవారు 75 లక్షల మంది ఉన్నారు. పారిశుద్ధ ఎకార్మికులు, పోలీసులు, పాత్రికేయులు, రవాణా ఉద్యోగులకు టీకా పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చిన్న వయసులో దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి టీకాలు ఇస్తారు. ఈ వివరాలను ఇప్పటికే ‘కోవిస్’లో నమోదు చేస్తున్నారు. ఎన్నికలలో గుర్తింపుకార్డు చూపించిన వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లే.. టీకా పంపిణీలోనూ వ్యవహరిస్తారు. ప్రతి పంపిణీ కేంద్రం వద్ద పోలీసు కానిస్టేబుల్ లేదా హోంగార్డును, టీకా వేసేందుకు ఇద్దరు, వివరాల నమోదుకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమిస్తారు. టీకా పంపిణీకి తగినంత స్థలం ఉన్న ప్రదేశాలనే కేంద్రాలుగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచిస్తోంది.

రియాక్షన్ వస్తే తక్షణ చికిత్స

టీకా వేసినప్పుడు.. కొందరికి దురద లాంటి సమస్యలు రావచ్చు. అలా వస్తే ఎలా స్పందించాలి.. ఏయే మందులను అందుబాటులో ఉంచుకోవాలన్న దానిపైనా కేంద్రం అవగాహన కల్పిస్తోంది. టీకా వేయించుకున్న వారిని కనీసం అరగంట అక్డే ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేందరం ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రస్థాయి అధికారులకు జూమ్‌లో శిక్షణ మొదలైంది. తర్వాత డిఎంహెచ్‌ఓలు, ఇతర ఉన్నతాధికారులకు శిక్షణ ఇస్తారు. టీకా పంపిణీపై ఆరోగ్య కార్యకర్తలకు నేరుగా శిక్షణ ఇస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News