Friday, May 17, 2024

తైవాన్ ఆక్రమణకే చైనా కసరత్తు: తైవాన్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

China is trying to conquer Taiwan

 

పింగ్‌టంగ్ (తైవాన్): తైవాన్ జలసంధి ద్వారా తూర్పు, దక్షిణ చైనా సముద్రాలను నియంత్రణ లోకి తీసుకురావాలన్నదే చైనా సంకల్పమని, ఆసియాపసిఫిక్ ప్రాంతం యథాతధ స్థితిని మరింత విస్తరింపచేసి తైవాన్‌కు ఇతర దేశాల సహాయం అందకుండా నివారించాలన్నదే చైనా లక్షమని తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రి జోసఫ్ వూ పేర్కొన్నారు. అకస్మాత్తుగా చైనా దాడి చేస్తే ప్రతిఘటించేందుకు తైవాన్ మిలిటరీ ‘లైవ్‌ఫైర్ డ్రిల్స్’ నిర్వహించిన తరువాత జోసెఫ్ వూ తైపీలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. గత వారం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడం తమ డ్రిల్స్‌ను ముమ్మరం చేశాయని చైనా సాకుగా చెబుతోందన్నారు.

నాన్సీ పెలోసీ పర్యటన తరువాత తైవాన్ నుంచి కొన్ని ఆహార పదార్ధాల దిగుమతులను నిషేధించిందని పేర్కొన్నారు. తైవాన్‌పై దాడి కోసమే ఈ డ్రిల్స్ రిహార్సల్స్ అని, తైవాన్‌ను మించి భౌగోళిక వ్యూహాత్మక ఆశయం సాధించడానికే చైనా ఎక్స్‌ర్‌సైజ్ ఉద్దేశమని చెప్పారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకునే హక్కు చైనాకు లేదని, తైవాన్ ప్రజలను నైతికంగా బలహానం చేయడమే చైనా లక్షమని ధ్వజమెత్తారు. గురువారం నుంచి చైనా మిలిటరీ నౌకలను , యుద్ధ విమానాలను తైవాన్ జలసంధి లోకి చైనా పంపుతోంది. తైవాన్ చుట్టూ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఉద్రిక్తతలను సడలించడానికి బదులు చైనా తన కసరత్తు పొడిగిస్తోంది. అవి ఎప్పుడు ముగుస్తాయో ప్రకటించకుండా ముట్టడిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News