Monday, April 29, 2024

దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షోత్సవాలు

- Advertisement -
- Advertisement -

సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన జిఎం గజానన్ మాల్య


మనతెలంగాణ/హైదరాబాద్:  దక్షిణ మధ్య రైల్వే ‘స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛత పక్షోత్సవాల’ ప్రచార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తోంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య గురువారం సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలో అధికారులు, సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రజలు, రైలు వినియోగదారులు, రైల్వే కుటుంబ సభ్యుల్లో ‘స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్’పై అవగాహన కలిగించడానికి జనరల్ మేనేజర్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారు కోవిడ్ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్లలో స్వచ్ఛత అధికారులు, సిబ్బంది ప్రచార ర్యాలీలను చేపట్టడంతో పాటు మొక్కలను నాటారు, మాస్కులు, శానిటైజేషన్ వస్తువులను పంపిణీ చేశారు. ఒకేమారు ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకై వీధి నాటకాల ద్వారా అవగాహన కలిగించారు. అధికారులు, సిబ్బంది స్వచ్ఛత ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలి

ఈ సందర్భంగా గజానన్ మాల్య మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది స్వచ్ఛత ప్రచార కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొనాలని ఆయన సూచించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని, సానుకూలంగా ఆలోచించాలని, ఇదే తరహా ఆలోచనా సరళిని మన కుటుంబ సభ్యుల్లో, చుట్టుపక్కల వారిలో కలిగించాలన్నారు. అపరిశుభ్రత నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ఏ ఒక్కరూ అపరిశుభ్రత పనులు చేయకుండా నివారించాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News