Monday, April 29, 2024

సిఎం ఆస్తులు ఆన్‌లైన్‌లో న‌మోదు

- Advertisement -
- Advertisement -

CM KCR Properties Are Registered Online

హైదరాబాద్ : రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎన్లిస్ట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్‌లో భాగంగా మర్కుక్ మండలం ఎర్రవెల్లి లోని తన నివాస గృహంకు శనివారం వచ్చిన పంచాయితీ రాజ్ అధికారులకు సాధారణ ప్రజల మాదిరే కె. చంద్ర శేఖర్‌రావు తన నివాస గృహా వివరాలను స్వయంగా అందించారు. ఎర్రవెల్లి గ్రామ కార్యదర్శి పి . సిద్ధ్దేశ్వర్ సిఎం కెసిఆర్‌ను కలిసి వారి నివాస గృహానికి చెందిన వివరాలను ఫోటోతో సహా ప్రత్యేకించిన అప్లికేషన్ టిఎస్‌ఎన్‌పిబి (తెలంగాణ రాష్ట్ర వ్యవసాయేతర ఆస్తి పుస్తకం యాప్)లో నమోదు చేశారు.

ఆస్తులపై ప్రజలకు హక్కు, వాటికి భద్రత కల్పించేందుకు ప్రతి కుటుంబ స్థిరాస్తుల వివరాలను నమోదుచేస్తున్నామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలలో ప్రాపర్టీల నమోదు దేశంలో మొట్ట మొదటి అతి పెద్ద ప్రయత్నమని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ తెలిపారు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. గ్రామీణ, పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని సిఎం కెసిఆర్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News