Monday, April 29, 2024

బోగస్, దగా

- Advertisement -
- Advertisement -
CM KCR serious on central government

 

కేంద్రానిది ఫ్యూడల్ ప్యాకేజీ
ఎఫ్‌ఆర్‌బిఎం పెంచుతూ దరిద్రపు ఆంక్షలా
రాష్ట్రాలు బిచ్చగాళ్లా, అంతవరకూ వస్తే కేంద్రం ఇచ్చే ముష్టి తీసుకోం, మెడపై కత్తిపెడితే సంస్కరణలు ఒప్పుకోం

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన విధానాన్ని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు 20 వేల కోట్ల మేర కు రుణ పరిమితి పెంచి, దరిద్రంగా ఆంక్షలు పెట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు ఒకటి కోరితే కేంద్రం ఇచ్చింది వేరని చెప్పారు. కేంద్ర ప్యా కేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి పెంచాలని తాము అడిగితే సంస్కరణలు అమలు చేస్తేనే ఇస్తామని అంటోందన్నారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లుగా భావిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. కేంద్రం తన పరువు తానే తీసుకుందని నిప్పులు చెరిగారు. రాష్ట్రాలపై ఈ విధంగా పెత్తనం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి డొల్ల.. వందశాతం బోగస్. నియంతృత్వ ధోరణిలో కేంద్రం వైఖరి ఉంది. రాష్ట్రాలకు నగదు ఇవ్వాలని కోరి తే.. రాష్ట్రాలను భిక్షగాళ్లుగా చూసింది. ఇదే నా కేంద్రం చూసే పద్ధతి..? అని కేంద్ర ప్రభు త్వ తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తు సమయంలో కేంద్రం వ్యవహరించిన తీ రు సరికాదన్నారు. మెడ మీద కత్తి పెట్టి ఇది చె య్యి, అది చెయ్యి అని చెప్పడం ప్యాకేజీనా..? అ ని ప్రశ్నించారు. ఆ నిబంధనలు అమలు చేస్తేనే రుణాలు ఇస్తామంటే అవి తమకు అవసరం లేదని సిఎం కెసిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనలు ఫ్యూడల్ విధానంలో ఉన్నాయని సిఎం కెసిఆర్ ధ్వజమెత్తారు. విదేశీ సంస్థలు కూ డా కేంద్రాన్ని విమర్శిస్తున్నా యన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని కొన్ని పత్రికలు ఎడిటోరియల్ రాశాయని గుర్తుచేశారు. మేం అడిగింది ఇది కాదని, రాష్ట్రాల చేతుల్లోకి నగ దు రావాలని కోరామని చెప్పారు. ఇది ఫెడరల్ వ్య స్థలో అవలంభించాల్సిన విధానం కాదన్నారు. వన్ నేష న్.. వన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తామే ఛాంపియన్స్ అని చెప్పారు. ప్రతి రూ.2,500 కోట్లకు ఒక సంస్కరణను ఆంక్షగా పెట్టార ని, ఇది డొల్ల.. బోగస్ ప్యాకేజీ అని తేలిపోయిందన్నారు. కేంద్ర విధానాలను అనుసరిస్తే పూర్తిగా ప్రైవేటే గతి అని సిఎం వ్యాఖ్యానించారు.

దరిద్రపు ఆంక్షలు పెట్టారు…

కరోనా లాంటి మహమ్మారిపై పోరు చేస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల పేరుతో ప్రకటించిన ప్యాకేజీ బోగస్ అని సిఎం కెసిఆర్ కొట్టిపారేశారు. కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయన్నారు. కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా…. ఎవరైనా అని సిఎం ఎద్దేవా చేశారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షలు పెట్టారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు.

కేంద్ర ప్యాకేజీ దగా

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్యాకేజీ దగా, మోసమన్నారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను బిక్షగాళ్లను చేస్తారా అని సిఎం కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్రం తీరు జనాలకు తెలియకుండా ఉండదని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడం

రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడమని కెసిఆర్ మరోసారి స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు కట్టుకున్నామని సిఎం తెలిపారు. పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని సిఎం కెసిఆర్ అన్నారు. నీటి వాటాలపై మాకు స్పష్టమైన అవ గాహన ఉంది. మాకున్న వాటా మేరకు నీళ్లను వాడుకుంటున్నామని సిఎం చెప్పారు. గోదావరి మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదని తెలంగాణ ప్రజలకు భంగం కలిగితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. రాయలసీమ గోదవారి మిగు లు జలాలు వాడుకోవచ్చన్నారు. కృష్ణా జలాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేస్తామని సిఎం చెప్పారు. బాబ్లీపై పంచాయితీ పెట్టి ఏం సాధించారన్నారు. పోతిరెడ్డి పాడు గురించి ఎవరు కొట్లాడారో ప్రజలకు తెలుసని వివాదాలకు పోకుండా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News