Monday, April 29, 2024

40 కేసులు పెరిగినయ్

- Advertisement -
- Advertisement -

Corona cases

 

రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య
23 రోజుల పసికందుకూ మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో 40 కరోనా కేసులు పెరిగాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 404కి చేరింది. దీనిలో 23 రోజుల పసికందుకు కరోనా సోకడం బాధకరం. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్ జిల్లాల్లోనూ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కరోనాతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45 మంది ఉండగా, 11 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో(రాత్రి 9 గంటల వరకు) వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌లో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ రావడం ఆ జిల్లాల్లో అందరినీ కలవరానికి గురిచేసింది. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా ఈ చిన్నారితో పాటు మరో ఇద్దరికి వైరస్ సోకిందని అధికారులు చెప్పారు. దీంతో పాజిటివ్ వ్యక్తులు నివాసముండే బీకే రెడ్డి కాలనీ, మర్లు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతాల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాకట్స్‌ను గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ ప్రాంతాల్లో రసాయనాలు పిచికారి చేశామని, పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ తరలించామని అధికారులు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో 150, నిజామాబాద్‌లో 33..
రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులలో హైదరాబాద్ జిల్లాలో ఎక్కువ నమోదైనాయి. మంగ ళవారం రాత్రి 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా కొత్తగా 17 కేసులు నమోదుకాగా, మొత్తం కరోనా బాధితుల సంఖ్య 150కి చేరింది. అదే విధంగా నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం ఒక్క రోజే 10 కేసులు నమోదవడం అందరిని ఆందోళన కలిగించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 36కి చేరింది. అయితే 25 జిల్లాల్లో నమోదైన కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్‌లో, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. తర్వాత వరుసలో వరంగల్ అర్బన్, గద్వాల్ జోగులాంబ, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి.

జిల్లాల వారీగా కేసులు సంఖ్య..
ఆదిలాబాద్ 11, భద్రాద్రి 2, హైదరాబాద్ 150, జగిత్యాల 3, జనగాం 2, జయశంకర్ 1, జోగులాంబ 22, కామారెడ్డి 8, కరీంనగర్ 7, మహాబూబాబాద్ 1, మెదక్ 5, మేడ్చల్ 15, ములుగు 2, నాగర్ కర్నూల్ 2, నల్గొండ 13, నిర్మల్ 4, నిజామాబాద్ 36,పెద్దపల్లి 2, రంగారెడ్డి 10, సంగారెడ్డి 7, సిద్దపేట్ 1, సూర్యపేట్ 8, వికారబాద్ 4, వరంగల్ అర్బన్ 23

సామాజిక వ్యాప్తి కాకుండా చర్యలు..
రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు పెరుగున్న నేపథ్యంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ ఆఫ్ హెల్త్ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం నేటి (బుధవారం) నుంచే ప్రారంభమవుతాయని వైద్యవర్గాలు స్పష్టం చేశాయి. దీని కోసం ఇప్పటికే అదనపు సిబ్బందిని కూడా నియమించే ప్రక్రియలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. లాక్‌డౌన్ పూర్తయ్యే లోపు కేసులు సంఖ్య తగ్గే విధంగా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోనున్నారు.

ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలతో పాటు సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, జోగులాంబ, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తొలి విడతగా ఈ జిల్లాల్లో ఈ కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. గద్వాల్లో కరోనా కలకలం రేకేత్తిస్తోంది. ఇటీవల ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వారి ద్వారా ఈ జిల్లాలో కరోనా సోకిందని వైద్యాధికారులు చెబుతున్నారు. మంగళవారం గద్వాల జిల్లాలో కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. వీళ్లందరూ మర్కజ్ వెళ్లొచ్చిన వారేనని, గద్వాల టౌన్ లో 7, రాజోలు మండల కేంద్రంలో మరో 2 కేసులు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు.

ఏపిలో 304 కరోనా కేసులు..
రాష్ట్రంలో 304 కరోనా కేసులు నమోదయ్యాయని, దీనిలో 260 మందికి పైగా మర్కజ్ వెళ్లొచ్చిన వారే ఉన్నారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో సుమారు 5వేల మందిని గుర్తించామని, 3లక్షల ర్యాపిడ్ టెస్టు కిట్స్ ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అయితే 2 లక్షల మందికి టెస్టులు చేయాల్సి ఉందని, వీరికి 240 మిషన్ల ద్వారా ర్యాపిడ్ టెస్టులు చేస్తామని చెప్పారు.

 

Corona cases reaching 404 in state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News