Monday, April 29, 2024

నేడు, రేపు వడగండ్ల వాన

- Advertisement -
- Advertisement -

Rain

 

గంటకు 30 నుంచి 40 కెఎంపిహెచ్ వేగంతో ఈదురుగాలులు
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య మహారాష్ట్ర దానిని ఆనుకొని ఉన్న విదర్భ ప్రాంతాల్లో 1.5 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొన సాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్లతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

బుధవారం అక్కడక్కడ ఉరుములు, వడగండ్లు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 kmph) పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, గురువారం అక్కడక్కడ ఉరుములు, మెరు పులు, ఈదురుగాలులతో (గంటకు 30 నుంచి 40 kmph) పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో సాధారణం కంటే 2- నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Rain with Hail tomorrow
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News