Monday, April 29, 2024

సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం

- Advertisement -
- Advertisement -

కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది
సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం
దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం
ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు

Coronavirus crisis become turning point for country

 

కోల్‌కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దుకునే అవకాశంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది మంచి సమయమని ఆయన స్పష్టంచేశారు. గురువారం వీడియో కాన్ఫరెఎన్స్ ద్వారా కోల్‌కతాలో జరుగుతున్న ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షిక ప్లీనరీ సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను మనదేశంలోనే తయారుచేసి వాటిని ఎగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

గడచిన ఆరు సంవత్సరాలుగా స్వయం సమృద్ధి దిశగా భారత్‌ను నడిపించేందుకు ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయని చెప్పారు. కాగా..ఈ దిశగా చేపడుతున్న చర్యలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని కోవిడ్ 19 సంక్షోభం మనకు పాఠాలు నేర్పిందని ప్రధాని అన్నారు. ఈ పాఠాల నుంచే ఆత్మనిర్భర్(స్వావలంబన భారత్) ప్రచారం ప్రారంభమైందని ఆయన వివరించారు.

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు భారీ పెట్టుబడులను సాధించాల్సిన సమయం ఆసన్నమైందని, సాంప్రదాయక పద్ధతులకు ఇక స్వస్తి పలకాల్సిందేనని మోడీ పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో పెద్ద ఎత్తున ఎగుమతులు చేపట్టే విధంగా దేశ ఆర్థిక విధానాలను మార్చుకోవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్న అన్ని వస్తువులను మనమే ఎగుమతి చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.చిన్న వర్తకందారుల ప్రయత్నాలను ఆయన ప్రశంసిస్తూ వారి నుంచి కొనుగోలు చేసే స్థానిక వస్తువులకు మనం డబ్బు మాత్రమే చెల్లించడం లేదని, వారి సేవలను సత్కరిస్తున్నామని ప్రధాని అన్నారు. పర్యావరణ హితంతో కూడిన స్వదేశీ వస్తు తయారీ బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో దేశంలోని రైతులు బానిసత్వ సంకెళ్ల నుంచి బయటపడ్డారని, వారి పంటలను వారు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలు ఏర్పడిందని మోడీ తెలిపారు. దేశంలోని ప్రతి గ్రామం, ప్రతి జిల్లా ఇక స్వయం సమృద్ధి సాధించాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు.

భారతీయులు తమ కోసం వస్తువులను తయారుచేసుకుని ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేసే పరిస్థితి ఏర్పడాలన్న స్వామి వివేకానంద ఆకాంక్షను ప్రధాని మోడీ ఉటంకిస్తూ వైద్య, రక్షణ పరికరాలు, బొగ్గు, ఖనిజాలు, వంటనూనెలు, ఇతర వస్తువుల తయారీలో భారత్ స్వయం సమృద్ధిని సాధించాలని తాను ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్నానని తెలిపారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలన్న దేశ ప్రజల ఆశయాన్ని ప్రశంసిస్తూ కోవిడ్ 19 సంక్షోభం దేశానికి గొప్ప మలుపుగా మారుతుందని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ రహిత దేశంగా భారత్‌ను మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను గుర్తు చేస్తూ దీని వల్ల బెంగాల్‌లోని జనుము పరిశ్రమకు కొత్త ఊపిరి లభిస్తుందని ఆయన చెప్పారు. బ్యాంకింగ్ సర్వీసులు దేశంలోని అట్టడుగు వర్గాలకు ఇప్పుడు అందుతున్నాయని, జన్‌ధన్ ఖాతాలు, ఆధార్ వంటి చర్యల వల్ల దేశంలోని కోట్లాదిమంది పేదలకు ప్రయోజనం చేకూరుతోందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News