Monday, April 29, 2024

పౌరుడి నిజాయితీని మెచ్చుకున్న సైబరాబాద్ సిపి

- Advertisement -
- Advertisement -

Cyberabad CP appreciated honesty of Citizen

హైదరాబాద్: తనకు దొరికిన డబ్బుల బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పగించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లోని పోషక్ ఫుడ్ కంపెనీలో రణ్‌వీర్ సింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఆఫీసు విధుల్లో భాగంగా రణ్‌వీర్‌సింగ్ కంపెనీ నుంచి బ్యాగులో రూ.6,03,000 నగదుతో హోండా యాక్టివా బైక్‌పై బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బ్యాగు కన్పించలేదు. వెనుకకు తిరిగి వచ్చి ఎంత వెతికినా దొరకకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వైపు మిత్రా పాలిమర్స్‌లో పనిచేస్తున్న అశోక్ తివారీ రోడ్డుపై వెళ్తుండగా బ్యాగు కన్పించింది. దానిని తీసుకున్న అశోక్ తివారీ దానిలో డబ్బులు ఉన్నాయి. వెంటనే ఈ విషయం తన కంపెనీ యజమాని రఘుబీర్‌సింగ్‌కు చెప్పాడు. ఇద్దరు కలిసి బ్యాగును తీసుకుని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి అప్పగించారు. అదే స్టేషన్‌ను తనిఖీ చేస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్రకు విషయం తెలిసింది. వెంటనే బ్యాగును అప్పగించిన అశోక్ తివారీ, రఘుబీర్ సింగ్‌ను అభినందించారు. బ్యాగును పోగొట్టుకున్న రణ్‌వీర్ సింగ్‌కు డబ్బులు ఉన్న బ్యాగును అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News