Monday, April 29, 2024

మూడేళ్లలో అడవుల దహనం

- Advertisement -
- Advertisement -
Deforestation incidents increased in three years: Center
ఘటనలు పెరిగాయి: కేంద్రం

న్యూఢిల్లీ: గత మూడేళ్లలో దేశంలో అడవుల దహనానికి సంబంధించిన సంఘటనలు రికార్డుస్థాయిలో పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020 నవంబర్ నుంచి 2021 జూన్ వరకు 3,45,989 సంఘటనలు జరిగాయని తెలిపింది. అదే సమయంలో కిందటి ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు మూడింతలని పేర్కొన్నది. దీనిపై శుక్రవారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు పర్యావరణశాఖ సహాయమంత్రి అశ్వినీచౌబే లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2019 నుంచి 2020 వరకు 1,24,473 సంఘటనలు,2018 నుంచి 2019 వరకు 2,10,286 సంఘటనలు జరిగాయని తెలిపారు. అడవుల్లో మంటలు రేగిన సంఘటనలు 2020-2021లో అత్యధికంగా ఒడిషాలో 51,968, మధ్యప్రదేశ్‌లో 47,795, చత్తీస్‌గఢ్‌లో 38,106 జరిగాయి. 2019-2020లో అత్యధికంగా ఒడిషాలో 10,602, మధ్యప్రదేశ్‌లో 9,537, చత్తీస్‌గఢ్‌లో 6,360 జరిగాయి. అడవుల దహనానికి సంబంధించిన ఘటనల్లో ఎక్కువభాగం ఎండిన ఆకులు, పొదలు తగులబడిన ఘటనలేనని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

Deforestation incidents increased in three years: Center

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News