Monday, April 29, 2024

‘బుల్లెట్‌పై బ్యాలెట్‌తో పోరాడతాం’

- Advertisement -
- Advertisement -

Delhi-election-2020

‘ఉచితాలు కాదు.. ఉద్యోగాలు కావాలి’
‘అభివృద్ధికే ఓటు’
ఎన్నికల్లో తొలి ఓటర్ల ప్రాధాన్యాలు

న్యూఢిల్లీ: బుల్లెట్ల కన్నా బ్యాలెట్‌కు, ఉచితాలకన్నా ఉద్యోగాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన వారు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడింది. శనివారం క్యూలలో కనిపించిన వారిలో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఆసక్తి కనిపించింది. తొలిసారి ఓటు వేసిన వారిలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రా కుమారుడు రెహాన్, ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ తనయుడు పుల్కిత్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ కొడుకు ఓజస్వి మాకెన్ కూడా ఉన్నారు. ‘కొత్తతరం సమానత్వం, అభివృద్ధి, ఆరోగ్యసంరక్షణ, విద్య, స్వచ్ఛమైన గాలి మొదలైన అంశాలకే ప్రాధాన్యమిచ్చి ఓటేస్తుంది.

ఏదో చేయాలని కేవలం మనసులో మాత్రమే అనుకునే వాళ్లకు నేను ప్రాధాన్యమివ్వలేదు’ అని 21 ఏళ్ల అక్షయ్‌సింగ్ చెప్పాడు. ‘బుల్లెట్లతో ఈ శక్తులతో పోరాడలేం. వాళ్లు బుల్లెట్ పేల్చినా మనం కాల్చకూడదు. వాళ్లతో బుల్లెట్‌తోనే పోరాడాలి’ అని మొదటిసారి ఓటేస్తున్న ప్రవీ ణ్ పంజ్ చెప్పారు. తిలక్ నగర్ పోలింగ్ బూత్‌లో ఓటేసినందు కు సంతోషంగా ఉందన్నాడు. తను ఓటేసిన గుర్తు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ వేలిపై ‘బ్యాలెట్ ఓవర్ బుల్లట్స్ ఫస్ట్ టైం’ అనే వాక్యం కూడా ఉంది. ‘ఏ ఓటరైనా ఓటేసేందుకు ఉద్యోగమే ప్రధానాంశం కావాలి. లైట్లు, నీళ్లు, ఇతర ఏ సౌకర్యమైనా ఆ తర్వాతే. ఆదాయం ఉంటే అన్నీ అవే వస్తాయి. కాబట్టి ఉచితాలకన్నా ఉద్యోగానికే నా ఓటు’ అని నన్‌గ్లోయ్‌లో తొలిసారి ఓటేసిన ప్రహ్లాద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

తాము అభివృద్ధికే ఓటేస్తామని చాందినీచౌక్ నియోజకవర్గం పోలింగ్ బూత్ బయట క్యూలో ఉన్న రాహుల్, అతని స్నేహితుడు కరన్ చెప్పా రు. నీరు, విద్యుత్‌కు ఛార్జీలు మాఫీ చేసి ఇప్పటి ప్రభుత్వం మంచి పనులు చేసిందని రాహుల్ అన్నాడు. అశోకా రోడ్ పోలింగ్ బూత్‌లో ఓటేసిన సొన్కాషి రాజన్ అనే మహిళ మాట్లాడుతూ ‘ఓటర్లు ఏ పార్టీని, అభ్యర్థిని ఆరాధించకూడదు. చేసిన పని, అభివృద్ధి మాత్రమే చూడాలి’ అన్నారు.

షహీన్‌బాగ్ పోలింగ్ స్టేషన్‌లో ఓటేసిన జామియా మిలియా విద్యార్థి సదాఫ్ మెహబూబ్ (18) ‘గత ఐదేళ్లలో అభివృద్ధి చేసిన పార్టీకే ఓటేశాను’ అన్నారు. కా వ్యతిరేక ఆందోళనలకు కేంద్రంగా మారిన ఈ ప్రాంతంలో చాలామంది యువత ఓటేసేందుకు రావడం చూసి ఆనందించానని ఆమె చెప్పారు. మొదటిసారి ఓటేసినందుకు సంతోషించానని కేజ్రీవాల్ కుమారుడు పుల్కిత్ చెప్పాడు. ప్రజారవాణా వ్యవస్థ విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ప్రియాంక గాంధీ కొడుకు రెహాన్ చెప్పాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News