Monday, April 29, 2024

సిక్కింలో డెల్టా వేరియంట్ వ్యాప్తి

- Advertisement -
- Advertisement -
Delta variant spread in Sikkim
98 నమూనాల్లో 97 పాజిటివ్

గ్యాంగ్‌టక్ : సిక్కిం ప్రభుత్వం తమ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటుని తెలుసుకోడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 98 మంది నమూనాల్లో 97 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పశ్చిమబెంగాల్ లోని కల్యాన్ పట్టణం లోని ల్యాబ్ ఈ పరీక్ష నిర్వహించింది. 97 మందికి డెల్టా వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీనిపై సిక్కిం ఆరోగ్యమంత్రి ఎంకె శర్మ ఆందోళన వ్యక్తం చేస్తూ డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లక్షణాలు బయటపడిన బాధితులు వెంటనే ఆస్పత్రిలో చేరాలని విజ్ఞప్తి చేశారు.

డెల్టా వేరియంట్ కట్టడి కోసం కొవిడ్ నుంచి కోలుకున్నవారి నమూనాలు కూడా సేకరించి వాటిని పరీక్షిస్తామని చెప్పారు. కంటైన్‌మెంట్ చర్యలకు ఉపక్రమిస్తామని వెల్లడించారు. సిక్కింలో ప్రస్తుతం కొవిడ్ పాజిటివిటీ రేటు దాదాపు 18 శాతంగా ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో నమోదైన 80 శాతం కేసులకు డెల్టా వేరియంట్ కారణమని కేంద్ర ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అల్ఫా వేరియంట్ కంటే 60 శాతం అధికంగా వ్యాపించే సామర్ధం డెల్టా వేరియంట్‌కు ఉంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌ను కట్టడి చేయగల సామర్ధంతో కూడుకుని ఉన్నవని కొవిడ్ వర్కింగ్ నిపుణులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News