Sunday, April 28, 2024

విజువల్ ట్రీట్ గా ‘దేవర’ పాటలు..!

- Advertisement -
- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తీస్తున్న దేవర చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌తో పాటు అనేక ప్రదేశాల్లో పెద్దగా గ్యాప్ తీసుకోకుండా సినిమాను చిత్రీకరిస్తున్నారు. జనవరి నెలాఖరులోపు షూటింగ్ పూర్తి చెయ్యాలనేది ప్లాన్. కొత్త ఏడాది స్పెషల్‌గా జనవరి 1న కానీ, డిసెంబర్ 31న కానీ ఒక వీడియో విడుదల చేస్తారని అంటున్నారు. ఆ వీడియోలో మేకింగ్‌కి సంబంధించిన కొన్ని విజువల్స్ ఉంటాయట. అయితే, ఈ విషయంలో అధికారికంగా టీం ఎలాంటి విషయం చెప్పలేదు.

దేవర చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ప్రస్తుతం మొదటి భాగం చిత్రీకరణ అవుతోంది. ఏప్రిల్ 5న విడుదల చెయ్యాలని టీం పట్టుదలగా ఉంది. అలాగే ఈ సినిమా పాటల ప్రమోషన్ కూడా జనవరి చివరి నుంచి మొదలుపెడతారని అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం ఇస్తున్నాడు. అనిరుధ్ తెలుగులో పలు సినిమాలకు సంగీతం ఇచ్చాడు కానీ ఎన్టీఆర్ మూవీకి పని చెయ్యడం ఇదే మొదటిసారి. జాన్వీ కపూర్, ఎన్టీఆర్‌లపై పాటలు ఈ నెలలోనే మొదలుపెడతారు. సినిమాని పాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల చెయ్యనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News