Sunday, April 28, 2024

వాహన చోదకులకు మరింత వెసులుబాటు…

- Advertisement -
- Advertisement -

Digital driving license at hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్: వాహన చోదకులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ డాక్యుమెంట్స్ వినియోగాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది. అంటే డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వంటివి ఇక జేబులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 1వ తేది నుంచి కొత్త మార్పు అమలులోకి రానున్నాయి. అవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోర్టల్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఇకపై డాక్యుమెంట్స్ చెక్ చేయాల్సి ఉంటే భౌతికంగా అవి మన దగ్గర ఉండే అవసరం లేదు. వాటి తాలూకు డిజిటల్ దస్తావేజులు పోర్టల్‌లో ఉంటాయి. లేదా మన వద్ద డిజిటల్ కాపీలు, మొబైల్‌లో ఉంటే చూపిస్తే వాటిని క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవే ఇటీవలే మోటార్ వెహికకల్ రూల్స్ 1989 పలు సంస్కరణలు చేసింది. అక్టోర్ 1వ తేదీ నుంచి వెహిక్యులర్ డాక్యుమెంటగ్స్ ఇ చలానాలు వంటివి పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. దీని వల్ల ప్రజలకు చిక్కులు తొలగుతాయి అని పోర్టల్‌లో తెలిపింది. 2019 ఆగస్టు 9న కొత్త మోటార్ వెహికల్స్ యాక్ట్ 2019 (అమెండ్‌మెంట్) అమలులోకి వచ్చాక ఈ మార్పు సాధ్యం అయింది. ఒక వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇ చలాన్లు తరచూ పోర్టల్‌లో అప్డేట్ అవుతుంటాయి. వాటిని రిఫర్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎలక్ట్రానికక్ విధానంలో వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయితే సదరు వాహన చోదకుడికి అధికారులు క్లియరెన్స్ ఇచ్చేస్తారు. పోర్టల్ లేదా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ద్వారా కాకుండా ఫిజికల్ డాక్యుమెంట్స్ కోరితే సదరు అధికారి వివరాలు కూడా పోర్టల్‌లో అప్డేట్ చేస్తారు. ఈ చర్యల వల్ల ప్రయాణీకులకు ఇక్కట్లు తప్పుతాయి అని పోర్టల్‌లో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News