Monday, April 29, 2024

ఐసిసికి చేరిన ఐదో టెస్టు వివాదం

- Advertisement -
- Advertisement -

ECB written to ICC on outcome of cancelled fifth Test against India

పరిష్కారం చూపపాలని లేఖ రాసిన ఇసిబి

లండన్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రద్దయిన అయిదో టెస్టు వ్యవహారం తాజాగా ఐసిసికి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడి ఉండడంతో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఐసిసికి లేఖ రాసింది. ఈ విషయంపై ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసిసి డిస్పూట్ రిజొల్యూషన్ కమిటీ (డిఆర్‌సి)కి లేఖ రాసినట్లు ఇసిబి ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. కరోనా కేసుల వల్ల ఈ మ్యాచ్ రద్దయినట్లు ప్రకటిస్తే తమకు 40 మిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వీలుంటుందని ఆ బోర్డు ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐసిసిని ఈ విషయంలో సాయం చేయమని కోరింది. ఐదో టెస్టుకు ముందు టీమిండియా బృందంలో ఒక సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో సీనియర్ ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. అదే విషయాన్ని బిసిసిఐకి తెలపడంతో ఇరు బోర్డుల మధ్య చర్చలు జరిపి మ్యాచ్‌ని రద్దు చేశారు. అయితే దీని ఫలితం .. సిరీస్‌పై ఆధారపడి ఉండడంతో పాటు ఇరు బోర్డులకు సమస్యగా మారింది. మరో వైపు ఆర్థికంగా నష్టం చేకూర్చే వీలుంది.

మరో వైపు బిసిసిఐ రద్దయిన ఐదో టెస్టును భవిష్యత్తులో తిరిగి నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ త్వరలోనే ఇంగ్లాండ్ వెళ్లి ఆ బోర్డు అధికారులతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితంపై పరిష్కారం చూపాలని ఇంగ్లాండ్ బోర్డు ఐసిసికి లేఖ రాసింది. ప్రస్తుతం ఐసిసి ముందు రెండుప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ ఐదో టెస్టును ఐసిసి పూర్తిగా రద్దు చేస్తే టీమిండియా 2 1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అప్పుడు దీన్ని నాలుగు టెస్టుల సిరీస్‌గా పరిగణిస్తారు. అలా కాక టీమిండియానే ఈ మ్యాచ్ ఆడడడానికి విముఖత చూపిన పేపథ్యంలో ఇంగ్లాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు. చివరి టెస్టులో ఆడడానికి ఆ జట్టు సిద్ధంగా ఉన్నా భారత్ ఒప్పుకోని పక్షంలో ఫలితాన్ని ఇంగ్లాండ్‌కు కేటాయిస్తారు. అప్పుడు 2 2తో సిరీస్ సమం అవుతుంది. అప్పుడు ఇంగ్లాండ్ బోర్డు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News