Monday, April 29, 2024

ఆర్థికవేత్తల నోట.. కెసిఆర్ మాట

- Advertisement -
- Advertisement -

cm kcr

 

హెలికాప్టర్ మనీపై విస్తృత చర్చ
20 రోజుల కిందే ప్రధానికి సూచించిన సిఎం కెసిఆర్
దేశ జిడిపిలో 5 శాతం నిధులు తీసుకురావాలని లేఖ
శాస్త్రీయంగా పంపిణీ చేపడితే మేలని సూచనలు

ప్రస్తుతం కొవిడ్ 19 నుంచి ఉపశమనం కోసం ఒక శాతం లోపు జిడిపిని భారత్ ఖర్చు చేస్తోంది. అయితే ఇంతకంటే ఎక్కువే ఖర్చు చేయొచ్చు. కంపెనీలకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు మరింతగా పెంచాలి. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేలా ఉద్దీపనలు ఉండాలి.
                                                                                       గీతా గోపినాథ్
                                                                              (ఐఎంఎఫ్, చీఫ్ ఎకనామిస్ట్)

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు భారతదేశం జిడిపిలో కనీసం 6 శాతం హెలికాప్టర్ మనీ విధానంలోకి తీసుకురావాలి. ఈ రకంగానే కొంత మేరకు మందగమనం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది.

                                                                ప్రణబ్ బర్ధన్ (కాలిఫోర్నియా వర్శిటీలో ప్రొఫెసర్)

మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ కారణంగా దేశం ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్తున్నందున.. హెలికాప్టర్ మనీకి వెళ్లడమే పరిష్కారమని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ విధానమే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే దేశ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోకుండా, ద్రవ్యోల్బణం పెరగకుండా, నోట్ల ముద్ర ణ చేపట్టి శాస్త్రీయంగా పంపిణీ చేస్తేనే మేలు జరుగుతుందని పేర్కొ ంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 20 రోజుల కిందటే ప్రధాని నరేంద్ర మోడీకి హెలికాప్టర్ మనీ, క్యూఈ ఆర్థిక విధానాలు చేపట్టాలని సూచించారు. మన దేశ జిడిపి 203 లక్షల కోట్ల రూపాయాలుగా ఉంది. ఇందులో 5 శాతం హెలికాప్టర్ మనీ కింద అందుబాటులోకి తీసుకురావాలని ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు. ఇప్పుడు సరిగ్గా ఆర్థికవేత్తలు కూడా అదే సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కంపెనీలు మూతపడకుండా ఉండేందుకు, ఉన్న ఉద్యోగాలు కాపాడటంతో పాటు కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు, కొనుగోలు డిమాండ్, సప్లయ్‌ను పెంచేందుకు, రాష్ట్రాలను ఆర్థిక లోటు నుంచి బయటపడేసేందుకు ఈ విధానమే మేలని పేర్కొంటున్నారు.

ప్రముఖ ఆర్థికవేత్తలు ప్రణబ్ బర్ధన్, ఈలా పట్నాయక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకానమిస్ట్ గీత గోపినాథ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించాల్సి ఉంటుందని, ఇందుకోసం హెలికాప్టర్ మనీ విధానం అమలు చేస్తే మంచిదేనని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఈ హెలికాప్టర్ మనీ ఎక్కడా.. ఏ విధంగా వినియోగంలోకి తీసుకువస్తే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామనే నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేశ జిడిపిలో కనీసం 6 శాతం వరకు ( డాలర్‌తో రేటుతో చూస్తే 15 లక్షల కోట్ల నుంచి రూ.18 లక్షల కోట్లు) హెలికాప్టర్ మనీకి వినియోగించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి పూర్తిగా కాకపోయినా కొంతమేరకు గట్టెక్కే అవకాశం ఉంటుందని ప్రణబ్ బర్ధన్ వ్యాఖ్యానించారు. ఇలా పట్నాయక్ జిడిపిలో 2 శాతం జిడిపి హెలికాప్టర్ మనీకి వాడితే పరిస్థితి మెరుగవుతుందన్నారు. చిన్న వ్యాపారాలకు, కంపెనీలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కోతను నిలిపివేయవచ్చునని సూచిస్తున్నారు. సంక్షేమానికి కూడా నిధులు ఖర్చు చేయవచ్చునని పేర్కొంటున్నారు.

ఈ విపత్కర సమయంలోనూ 202021 ఆర్థిక సంవత్సరానికి దేశ జిడిపి వృద్ధి రేటు 1.9 శాతం వరకు పెరగొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు హెలికాప్టర్ మనీ, క్యూఈ ఆర్థిక విధానాలే సరైనవని అభిప్రాయాలు పెరుగుతున్నాయి.

హెలికాప్టర్ మనీ విధానం అంటే ?
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్‌మ్యాన్ 1969 హెలికాప్టర్ మనీ విధానాన్ని ప్రతిపాదించారు. 2002లో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెన్ బెర్నాంకే దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ విషయంలో మన దేశంలో ఆర్‌బిఐది కీలక పాత్ర. దీని ప్రకారం నోట్ల ముద్రణ పెంచి ఆర్థిక వ్యవస్థలోకి పెద్దఎత్తున నగదును చలామణీలోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం దీని వెనుకున్న ఆంతర్యం.

ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగులు శక్తి తగ్గిపోయిన నేపథ్యంలో డబ్బులను విరివిగా ఇవ్వడం ద్వారా డిమాండ్‌ను, సప్లయ్‌ను పెంచడానికి ఈ విధానం దోహద పడుతుంది. క్వాంటిటేటివ్ ఈజింగ్ కూడా ఇలాంటిదే అయినా దీనికి ప్రభుత్వం వద్ద నుంచి ఆర్‌బిఐ బాండ్లు కొనుగోలు చేస్తుంది. దీని కింద కూడా నోట్లను అధికంగా ముద్రించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఈ విధానాన్ని అమెరికా, జపాన్ వంటి దేశాలు అవలంబించాయి. 2008లో సంభవించిన మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా హెలికాప్టర్ మనీ విధానాన్ని అనుసరించింది. 2016లో జపాన్ సైతం హెలికాప్టర్ మనీ విధానాన్ని అవలంబించింది. అయితే నోట్ల ముద్రణను ఎల్లప్పుడూ ఎందుకు చేపట్టకూడదనే ప్రశ్న తలెత్తవచ్చు. దేశంలో వస్తు సేవల ఉత్పత్తి ఆధారంగా నోట్లను ముద్రించి ఆర్‌బిఐ చలామణీలోకి తీసుకొస్తుంది. ఒకవేళ నిత్యం నోట్లను పెద్ద సంఖ్యలో ముద్రించి జనాలకు చేరవేస్తే కొన్నాళ్లకు దాని విలువ పడిపోయే ప్రమాదం ఉంటుంది.

దేశ జిడిపిలో 2 శాతం ఆర్థిక ఉపశమనానికి ఖర్చు చేయాలి. హెలికాప్టర్ మనీ శాస్త్రీయంగా పంపిణీ చేయాలి. కొనుగోలు శక్తిని పెంచి, డిమాండ్ అండ్ సప్లయ్ పెంచాలి. రాష్ట్రాలకు చేయూతనివ్వాలి.
ఈల పట్నాయక్

ముందుచూపుతోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హెలికాప్టర్ మనీ, క్యూఇ విధానంపై ప్రధాని మోడీకి సూచన చేశారు. ఇప్పటికైనా దీనిపై ఆలోచన చేసి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కేంద్రానికి తెలుసు. రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి. ఉద్యోగాలు కాపాడేందుకు, సంక్షోభం నుంచి గట్టెక్కుందుకు సిఎం కెసిఆర్ సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి.
                                                                       టి.హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

 

Extensive Discussion on Helicopter Money
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News