Monday, April 29, 2024

అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాలకు చెక్

- Advertisement -
- Advertisement -

వాట్సప్, సోషల్‌మీడియాలో షేర్ చేసే ముందు
‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌ను చూసుకోవాలి
వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

fake news

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్‌పై వస్తున్న అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్’ను ప్రారంభించింది. కరోనాపై ఏదైనా అంశాన్ని వాట్సప్, సోషల్‌మీడియాలో షేర్ చేసే ముందు ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్’లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. (ఉదాహరణగా) ఈ మధ్యన ఇటలీలోని ధనవంతులు తమ దగ్గర ఉన్న డబ్బుని రోడ్ల మీద పడేశారు. ఈ డబ్బు తమ పిల్లలను, తమ కుటుంబసభ్యులను కాపాడలేక పోయిందని రోడ్ల మీద డబ్బుని పాడేశారంటూ కొన్ని ఫొటోలను సోషల్‌మీడియాలో చాలామంది షేర్ చేశారు. అయితే అవి పాత ఫొటోలని వాటికి కరోనా వ్యాధికి ఎలాంటి సంబంధం లేదని ‘ఫ్యాక్ట్ చెకర్ వెబ్‌సైట్’ విశ్లేషణలో తేల్చింది. ఆ ఫొటో వెనిజులా దేశానికి సంబంధించింనదని ద్రవ్యోల్బంతో నోట్లకు విలువ లేకుండా పోవడంతో అలా రోడ్లపై నోట్లను వేశారని ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్’లో పేర్కొంది. ఇలా వాట్సప్‌లో, సోషల్‌మీడియాలో షేర్ అవుతున్న చాలా వాటికి సంబంధించిన నిజాలను అందులో పోస్టు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఎవరైనా పోస్ట్ చేయాలంటే ముందుగా ఈ వెబ్‌సైట్‌లో క్రాస్ చెక్ చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.

అబద్ధపు ప్రచారాన్ని నిరోధించడానికి ముందుకు రావాలి: పిఐబి

దీంతోపాటు కరోనాకు సంబంధించిన అబద్ధపు ప్రచారాన్ని నిరోధించడానికి ముందుకు రావాలని ప్రభుత్వరంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ కు సంబంధించిన అవాస్తవాలను సోషల్ మీడియాలో గమనిస్తే తమకు తెలియజేయాలని సంస్థ యూజర్లను కోరింది. సోషల్ మీడియా నిండా ఫేక్ న్యూస్‌లే వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అనవసరంగా ఫార్వర్డ్ చేయకుండా వచ్చిన సమాచారంలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేయాలని పోలీసులుతో పాటు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయండి:

తప్పుడు సమాచారానికి, అబద్ధపు వార్తలకు సోషల్ మీడియా వేదిక కారాదని ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా ఈ విధమైన సమాచారాన్ని తమ ప్లాట్ ఫాంల నుంచి తొలగించాలని, వాస్తవ సమాచారాన్ని మాత్రమే ఉంచాలని సోషల్ మీడియాలకు సూచించింది. తప్పుడు సమాచారం ఎవరైనా పెడితే ఆ వార్త స్క్రీన్ షాట్ లేదా లింక్ ను 8799711259 అనే వాట్సాప్ నెంబర్‌కు లేదా pibfactchech@gmail.com మెయిల్ ఐడిలకు పంపించాలని పిఐబి తెలిపింది.

 

Fake news identify by Fact chect website in india
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News