Sunday, April 28, 2024

ఖమ్మంలో కుక్కకు సీమంతం….

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో మన అందరికి తెలిసిందే. కొందరికి మూగ జంతువులపై ఎనలేని ప్రేమ ఉంటుంది. తన ఇంట్లో ఉన్న కుక్క గర్భం దాల్చడంతో దంపతులు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. బంధుమిత్రులు ఇంటికి పిలుపించుకొని కుక్కకు సీమంతం చేశారు ఆ దంపతులు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలో జరిగింది. ఎన్‌టిఆర్ నగర్‌కు చెందిన నవ కుమార్- ఆశా దంపతులు కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్కకు ముద్దుగా స్టెఫీ అనే పేరు పెట్టారు. స్టెఫీ గర్భంతో ఉండడంతో అంగరంగా వైభవంగా సీమంతం చేశారు. సీమంతానికి బంధు మిత్రులను ఆహ్వానించి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు సోషల్ మీడియాలో పిచ్చికి పరాకష్ట అని కామెంట్లు పెడుతున్నారు. కుక్కకి సీమంతమా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News