Monday, April 29, 2024

చర్చలకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

చట్టాల రద్దు, మద్ధతు ధర అజెండాగా 29 ఉ.11గంటలకు చర్చలకు సిద్ధం

కేంద్రానికి రైతు సంఘాల లేఖ

కూలంకష చర్చలకు మేం సిద్ధం
వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను మాకు తెలియజేయాలి
కనీస మద్ధతు ధర హామీ ఇవ్వాలి
ఏయే ధరల ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు జరగుతాయో స్పష్టం చేయాలి
వీటిని చర్చల అజెండాలో చేర్చాలి
సుదీర్ఘ భేటీ తర్వాత ప్రభుత్వానికి రాసిన లేఖలో 40 రైతు సంఘాల షరతు

Farmer Unions ready to Resume Talks with Central Govt

న్యూఢిల్లీ: కేంద్రంతో ఈ నెల 29న చర్చలకు సిద్ధమని రైతుల నేతలు శనివారం తెలిపారు. చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నట్లు రైతు సంఘాల సమాఖ్య నేతలు తెలిపారు. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలిగిపోవాలనే ఉద్ధేశంతో మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చలకు సిద్ధపడ్డట్లు తెలిపారు. ఈ మేరకు 40 రైతు సంఘాల తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ సం యుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు లేఖ పంపించారు. ఈ రోజు మధ్యాహ్నం రైతు నేతలు సమావేశం అయ్యారు. చర్చల దిశలో కేంద్రం నుంచి అందిన ఆహ్వానంపై, ప్రతిపాదనలపై చర్చించారు. ఏ విషయంపై అయినా కూలంకుషంగా మాట్లాడుకునేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉ న్నాయని ఈ సందర్భంగా విలేకరులకు నేతలు తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం సుదీర్ఘ స్థాయిలో జరిగిన తరువాత రైతు నేతలు వివరాలను తెలిపారు. తాము వద్దంటున్న వ్యవసాయ చట్టాల రద్దు సంబంధిత ప్రక్రియను తెలియచేయాలి. కనీస మద్దతు ధరకు హామీ ఇ వ్వాలి. ఏఏ ధరల ప్రాతిపదికన రైతుల ధాన్యాల కొనుగో ళ్లు జరుగుతాయనేది స్పష్టం చేయాలి. ఇవన్నీకూడా చర్చల అజెండాలో ఉండాలని, సంప్రదింపుల పునరుద్ధరణకు వీలేర్పడుతుందని సమాఖ్య తరఫున రైతు నేత దర్శన్ పాల్ విలేకరులకు తెలిపారు.

తమ సమావేశం సందర్భంగా ఇతర కీలక అంశాల ప్రస్తావన కూడా వచ్చిందని, ఈ నెల 30వ తేదీన కుండ్లీమానేసర్ పల్వాల్ (కెఎంపి) జాతీయ రాదారిపై రైతుల ట్రాక్టర్ల ర్యాలీ జరుగుతుందని వివరించారు.ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి జనం తరలివచ్చి నిరసనల్లో ఉన్న రైతులతో కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పాల్ తెలిపారు. సింఘూ నుంచి టిక్రికి అక్కడి నుంచి కెఎంపికి రైతుల యాత్ర సాగుతుందని మరో నేత రాజీందర్ సింగ్ తెలిపారు. సమీప రాష్ట్రాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రాలీలలో తరలిరావాలని పిలుపు నిచ్చినట్లు చెప్పారు. సరైన పద్ధతిలో సర్కారు ముందుకు వస్తే చర్చలకు సిద్ధమని, ఇందుకు తాము తేదీని కూడా ఖరారు చేశామని, అయితే ఇదే సమయంలో ఉద్యమ ఉధృతికి కూడా సిద్ధం అయ్యామని సింగ్ తెలిపారు. చర్చలకు రావాలని ప్రభుత్వం పిలుస్తున్నందున, తేదీ ఇతర అంశాలను తెలియచేయాలని కోరినందున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్చల తేదీని తెలియచేసినట్లు తెలిపారు. ఇక దీనిపై స్పందించాల్సింది ప్రభుత్వమే అని భారతీయ కిసన్ యూనియన్ నేత రాకేష్ తికాయిత్ వార్తాసంస్థలకు తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యదర్శికి రైతుల సమాఖ్య పంపించిన లేఖలో పంట వ్యర్థాల దహనం సమయంలో కేసుల నమోదు, శిక్షల విషయాలు, విద్యుత్ ముసాయిదా బిల్లు 2020లో మార్పులు చేర్పులపై కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పంట వ్యర్థాల తగులబెట్టడంతో తలెత్తే కాలుష్య అంశానికి సంబంధించి రైతులను వాయు ప్రమాణా నాణ్యత నిర్వహణ సంబంధిత ఆర్డినెన్స్ నుంచి తప్పించాలి. రైతుల ప్రయోజనాల పరిరక్షణ దిశలో విద్యుత్ బిల్లు ఉండాలని రైతులు కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News