Thursday, May 9, 2024

17వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన

- Advertisement -
- Advertisement -

Farmers protest enters 17th day

న్యూఢిల్లీ: కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దిగిరాకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామంటున్నాయి రైతుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అటు రైతుల ఆందోళనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అమృత్ సర్ లోని కిసాన్ ముజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సమాజ్ వాదీ పార్టీ రైతులకు మద్దతు ప్రకటించింది. 700 ట్రాక్టర్లతో కిసాన్ ముజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యులు ఢిల్లీ బయలుదేరారు. ఈ నెల 14న జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు సమాజ్ వాదీ పార్టీ పిలుపునిచ్చింది. నేడు ఢిల్లీ-ఆగ్రా రోడ్ల దిగ్బంధానికి రైతు సంఘాలు పిలుపు నిచ్చాయి. దేశవ్యాప్తంగా టోల్ గేట్ల రుసుము కట్టకుండా నిరసన తెలపాలని పిలుపు నిచ్చాయి రైతు సంఘాలు.

Farmers protest enters 17th day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News