Monday, April 29, 2024

సాగర్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

సాగర్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం

సిబ్బంది అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

మన తెలంగాణ/ నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుదుత్పాదనలో ఎనిమిదవ యూనిట్ మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నిపమాదం జరిగినట్లు హైడెల్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట్‌రాజన్ తెలిపారు. అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో మంటలను వెంటనే ఆర్పివేశారు. ఓపెన్ యార్డులో మంటలు రావడం వలన పెనుప్రమాదం తప్పిందని, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. విద్యుదుత్పాదనను సదరు గుత్తేదారులు మళ్లీ మరమ్మతులు చేసినట్లు ఆయన తెలిపారు. అధికారులు ఇప్పటికైనా పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని పలువురు కోరారు.

Fire broke out at Nagarjuna Sagar Power Plant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News