Monday, April 29, 2024

‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ సాంగ్ గ్లిమ్స్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన 65 పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ చేయడానికి మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరిపే అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా సంబరాలు ప్రారంభించేశారు. చిరు పుట్టినరోజుకి చాలా రోజుల ముందు నుంచే #చిరుబర్త్‌డేఫెస్ట్‌బిగిన్స్ హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ట్విట్టర్‌ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రామ్‌చరణ్ యువశక్తి అభిమాన సంఘం మెగాస్టార్ బర్త్ డేని మరింత స్పెషల్‌గా జరపాలని నిర్ణయించింది. చిరు బర్త్ డే కానుకగా ’మెగాస్టార్స్ మెగా ర్యాప్’ పేరుతో ఓ స్పెషల్ ర్యాప్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలో తాజాగా బాస్ బర్త్ డే స్పెషల్ అంటూ ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ సాంగ్ గ్లిమ్స్ విడుదల చేశారు. ‘ఎవ్రీ బడీ ట్యూన్ ఇన్ టూ ది బీట్..’ అంటూ సాగిన ఈ ర్యాప్ గ్లిమ్స్‌లో మెగా ఫ్యాన్స్ ‘జై చిరంజీవ’ ఫ్లాగ్స్‌తో చిరు ఫేస్ మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ఈ మెగా ర్యాప్ పూర్తి సాంగ్ ని చిరంజీవి బర్త్ డే ముందురోజు అంటే ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించగా సురేంద్ర ర్యాప్ ఆలపించారు.

Glimpse of ‘Mega Rap’ Song Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News