Monday, April 29, 2024

వాచీలో దాచి బంగారం స్మగ్లింగ్

- Advertisement -
- Advertisement -

Gold seized at Shamshabad airport

శంషాబాద్‌లో 233.4గ్రాముల బంగారం స్వాధీనం

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షార్జా నుంచి బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రమాణీకుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా అతడి చేతి గడియారం లోపలిభాగంలో అక్రమంగా తరలిస్తున్న 233.4గ్రాముల బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు బంగారాన్ని సీజ్‌చేసి నిందితున్ని అరెస్టు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.11.56లక్షలు ఉంటుందని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా వరుసగా రెండవరోజు అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News