Tuesday, November 12, 2024

హార్దిక్ పాండ్య తండ్రి మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తండ్రి హిమాన్షు పాండ్య శనివారం మృతి చెందారు. ఆయను ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. హార్దిక్ ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని భారత్ చేరుకున్నాడు. మరోవైపు కృనాల్ పాండ్య బరోడా తరఫున ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. తండ్రి మరణవార్త తెలియగానే కృనాల్ ముంబై చేరుకున్నాడు. ఇక పాండ్య బ్రదర్స్‌ను మెరుగైన క్రికెటర్లుగా తీర్చిదిద్దడంలో వారి తండ్రి హిమాన్షు కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని సోదరులిద్దరూ పలుసార్లు వెల్లడించారు.

Hardik Pandya’s father passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News