Sunday, April 28, 2024

ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ఆలోచించండి

- Advertisement -
- Advertisement -

Harish Rao Speech in Dubbaka Election Campaign

దుబ్బాక: ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కనిపించరని.. ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్‌రావు అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం అప్పనపల్లి, హసన్‌మీరాపూర్ గ్రామాల్లో దుబ్బాక అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయిలకాడ మీటర్లు అని ప్రజలు గమనించాలని అన్నారు. టిఆర్‌ఎస్ అంటే 24గంటల ఉచిత కరెంట్ అని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లను బిస్కెట్లలాగా పంచిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రాదనుకున్న తెలంగాణ కెసిఆర్‌తోనే వచ్చిందని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలపై సిఎం కెసిఆర్‌కు ప్రత్యేకమైన ప్రేమ ఉందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఎండాకాలం, యాసంగిలో రూ. 5వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారని తెలిపారు. రైతులు అప్పుల పాలై ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ పలకరించిన పాపాన పోలేదని అన్నారు. దుబ్బాక ఎన్నికలు సోలిపేట రామలింగన్న మరణంతో వచ్చాయని ఆయన ఆశయాల సాధన కోసం స సుజాతను గెలిపించాలని కో రారు. నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని కష్ట, సుఖాల్లో అండగా ఉంటానని మీ అందరికోసం తన ఇంటి తలుపులు తెరి చేఉంటాయని మంత్రి భరోసా నిచ్చారు. హసన్‌మీరాపూర్ గ్రామానికి అప్పట్లో కెసిఆర్ 15 రోజుల్లో ఇక్కడ ఉండి రోడ్డు వేయించి బస్సు తెప్పించారని గుర్తు చేశారు. దుబ్బాక ప్రజలు కోరిన విధంగా సిఎం ఏ విధంగా అభివృద్ధి పనులు చేశారో తాను అసన్‌మీర్‌పూర్, అప్పనపల్లి గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో సీసీ రోడ్లు, మోరీలు, ఖాళీ స్థలాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తానని అన్నారు. ఇంటి అడుగు జాగలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించుకునేందుకు అసెంబ్లీలో ఆమోదం వచ్చిందని తెలిపారు. గ్రామానికి 50 ఇండ్లు మంజూరు చేస్తానని అన్నారు. కరోనా వల్ల కొంత ఆదాయం తగ్గిందని, అయినా ఉచితంగా రేషన్, పప్పులు, సరుకులు అందించామని తెలిపారు. ముదిరాజ్ , యాదవ్ సంఘాల భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సుజాతను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునితాలకా్ష్మరెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, హసన్‌మీరాపూర్ సర్పంచ్ లక్ష్మీ నాగయ్య, అప్పనపల్లి సర్పంచ్ లక్ష్మీ పోషాద్రి, ఎంపీటీసీ చిత్ర లావణ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ ఖాతా కనకరాజు, అప్పనపల్లి గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి నంగునూర్ పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్‌గౌడ్, కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల్తె వెంకటేశం, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు బిజ్జ లక్ష్మన్, టీఆర్‌ఎస్ కార్యదర్శి చలం, నాయకులు బో నాల యాదగిరి, ఆసముత్యం తదితరులు పాల్గొన్నారు.

Harish Rao Speech in Dubbaka Election Campaign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News