Monday, April 29, 2024

గన్ తో కాల్చుకొని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్ తో తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెఎస్ఆర్ పి 8వ బెటాలియన్ కు చెందిన హుక్చిగౌడ(56) నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే, బుధవారం విధులు నిర్వహిస్తున్న అతను శ్వాస సమస్యతో భాదపడడం, ముక్కులోంచి రక్తం రావడంతో తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. పై అధికారులు అతనిని ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోమని సూచించారు. అతను వినకుండా ఇంటికి తర్వాత వెళ్తానని చెప్పి మళ్లీ స్టేషన్ కు వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హుక్చిగౌడ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నాడు. గన్ శబ్దం రావడంతో తోటి సిబ్బంది లేచి చూసేసరికి అతను రక్తపు మడుగుల్లో పడి ఉండడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతను మరణించినట్లు వైద్యలు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Head Constable shot himself in Bengaluru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News