Thursday, May 9, 2024

యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Hero Vishwak Sen Tests Covid Positive

హైదరాబాద్:  ఈ నగరానికి ఏమైంది, పాగల్ చిత్రాలతో సుపరిచితుడైన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ శుక్రవారం కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకిన విషయాన్ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉండి, తన వైద్యుడి సలహా మేరకు అవసరమైన చికిత్స తీసుకుంటున్నట్టు పోస్టులో రాశాడు. విశ్వక్ సేన్ తన అభిమానులను మాస్క్‌లు ధరించాలని, వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. విశ్వక్ ప్రస్తుతం అశోక వనంలో అర్జున కళ్యాణం, గామి, ఓరి దేవుడా సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News