Monday, April 29, 2024

అత్యధిక బియ్యం అందిస్తున్న జిల్లా నల్లగొండ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

More rice export from nalgonda dist

 

నల్లగొండ: తెలంగాణలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. నల్లగొండలో పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్‌సి, ఎస్‌టి భవనాలను మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు ప్రారంభించారు. ఐటి హబ్‌కు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు అత్యధిక బియ్యం అందిస్తున్న జిల్లా నల్లగొండ అని, దేశానికి అత్యధికంగా బియ్యం సరఫరా చేసే స్థాయికి తెలంగాణ చేరిందని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

గ్రామాలు, పట్టణాలకు సకాలంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభవృద్ధి దేశంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణ రాకముందు, ఇప్పటి పరిస్థితులను భేరీజు వేసుకోవాలన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను నిర్మూలించామని, 65 ఏళ్లలో సాధ్యంకాని ఫ్లోరోసిస్ సమస్యను ఆరేళ్లలో పరిష్కరించామన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు పెట్టుబడ్డి ఇచ్చి ప్రోత్సహించామన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? అని కెటిఆర్ ప్రశ్నించారు. నల్లగొండలో ఐదు బస్తీ దవాఖానాలు మంజూరు చేశామని, ఐటి సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమని స్పష్టం చేశారు. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐటి హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News