Sunday, April 28, 2024

హరిత భారతం కోసం కృషి

- Advertisement -
- Advertisement -

Heroine Trisha who planted the plants

 

మొక్కలు నాటిన హీరోయిన్ త్రిష

మనతెలగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహాఅద్భుతంగా ముందుకు సాగుతుంది. లాక్ డౌన్ సమయంలోనూ పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలునాటి పర్యావరణ స్ఫూర్తిని చాటుతున్నారు. ప్రముఖ దక్షిణాది నటుడు ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటి,ఆపై నటి త్రిషను నామినేట్ చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన త్రిష శనివారం చెన్నైలోని తన నివాసంలో మొక్కలునాటి ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. వాతావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. నాబాధ్యతగా నేను మొక్కలునాటాను, మీరుకూడా ఇందులో పాల్గొని మొక్కలు నాటాలని త్రిష అభిమానులకు పిలపునిచ్చారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సతోష్‌కుమార్‌కు త్రిష కృతజ్ఞతలు తెలిపారు. బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మణికొండలో సింగర్ సత్యయామిని మొక్కలునాటారు. అనంతం సింగర్స్ మనీషా, రమ్య, అనుదీప్‌కు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. సినిమా నటుడు ముకేష్ ఇచ్చిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి నటి మని మహేష్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొక్కలునాటారు. అనంతరం సినీ అర్టిస్టులు కీర్తి,సంధ్య, శరత్‌లకు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. మహాదేవ్‌పూర్ డిఎఫ్‌ఓ వజ్రారెడ్డి ఇచ్చిన ఛలెంజ్‌ను స్వీకరించి మహాదేవ్‌పూర్ ఎఫ్‌ఆర్‌ఓ రేణుక మొక్కలునాటారు.భూపాలపల్లి ఎఆర్‌ఓలు సంతోష్, నరేష్, సుమన్‌లకు రేణుక గ్రీన్‌ఇండియా సవాల్ ఇచ్చారు.

Heroine Trisha who planted the plants

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News