Saturday, April 27, 2024

ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణ 5వారాల పాటు వాయిదా..

- Advertisement -
- Advertisement -

TS High Court holiday on December 1

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పథకం ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణను హైకోర్టు బుధవారం ఐదు వారాలకు వాయిదా వేసింది. ఎల్‌ఆర్‌ఎస్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం రుసుములు నిర్ధారించి ప్రక్రియ ప్రారంభించగా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించగా ప్రభుత్వం గడువు అడిగింది. దీంతో విచారణను హైకోర్టు ఐదు వారాలకు వాయిదా వేసింది. మునిసిపాలిటీ, గ్రామపంచాయతీల్లో ఆమోదం లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్(లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీం)ను ప్రవేశపెట్టింది.

హెచ్‌ఎండిఎ సాంకేతిక అనుమతి లేని లేఅవుట్లన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు క్రమబద్ధీకరించనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎల్‌ఆర్‌ఎస్ జివొ 131 సస్పెండ్ చేయాలని పిటీషన్ వేశారు. అనుమతి లేని అక్రమ లేఔట్లను క్రమబద్ధీరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జివొ రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు భారీ స్పందనలో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే వీటిని క్షుణ్ణంగా పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శిఖం భూములు, అసైన్డ్‌భూములు, నాలాలు కబ్జా చేసి వేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలామంది వీటికింద ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

High Court Stay on LRS implementation for 5 weeks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News